సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. 19 అసిస్టెంట్ కమాండెంట్ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 21వ తేదీ లోపు సీఐఎస్ఎఫ్అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కేవలం సీఐఎస్ఎఫ్ లో అనుభవం ఉన్న అభ్యర్థులకు కేటాయించారు. ఇతరులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, వయోపరిమితి వివరాలను నోటిఫికేషన్ లో తెలియజేశారు.
ఎవరు అర్హులంటే...
నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2022 జనవరి 1 నాటికి సీఐఎస్ఎఫ్ సబ్ ర్యాంక్‌లో కనీసం నాలుగు ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అపాయింట్‌మెంట్ లెటర్ జారీ అయ్యే వరకు సర్వీస్ లో క్లీన్ రికార్డ్ ఉండాలి. అభ్యర్థి వయస్సు ఆగస్టు 1 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. అంటే 1987 ఆగస్టు 2 తర్వాత పుట్టిన వాళ్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు ఉంది.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి?
1. UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని క్లిక్ చేయండి.
2. హోమ్‌పేజీలో సీఐఎస్ఎఫ్ ఏసీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2021 లింక్‌పై క్లిక్ చేయండి.
3. వెంటనే న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో వివరాలు, డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
4. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపి, ఫీజు చెల్లించండి.
5. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ ప్రింట్ తీసుకోండి.
Also Read: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జాబ్ కొడితే రూ.60 వేల జీతం.. ఇంకా రెండు రోజులే ఉంది
ఈ అడ్రస్ కు హార్డ్ కాపీ పంపాలి
దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని హార్డ్ కాపీని సీఐఎస్ఎఫ్ అధికారులకు పోస్టు చేయాలి. డైరెక్టర్ జనరల్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 13, సీజీఓ కాంప్లెక్స్, లోడి రోడ్, న్యూ దిల్లీ-110003 అడ్రస్‌కు ఈ ప్రింట్ అవుట్ పంపాలి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) భారతదేశంలోని కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఒకటి. ప్రస్తుతం ఈ విభాగంలో 1,48,371 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశంలో ముఖ్యమైన ప్రభుత్వ భవనాలకు సెక్యూరిటీ, దిల్లీ మెట్రో, విమానాశ్రయ భద్రత విధుల్లో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాల్గొంటారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఉండే ఈ విభాగంలో పనిచేయడానికి యువత ఆసక్తి చూపుతుంటారు.
Also Read:నేవీ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డులో ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి