మేషం
ఏదో కారణంగా కోపం తెచ్చుకుంటారు. టెన్షన్ పెరగొచ్చు. ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అనవసర పనుల కోసం మీ సమయాన్ని వృథా చేయకండి. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. 
వృషభం
విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. దూరప్రాంత ప్రయాణాలు వాయిదా వేయండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి
మిథునం
ఆచరణలో టెన్షన్ కనిపిస్తుంది. వివాదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావొచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగులు , వ్యాపారులకు సాధారణ సమయం.
Also Read: పూటకో రూపం.. అక్కడ అమ్మవారిని టచ్ చేస్తే ప్రళయం తప్పదట..  
కర్కాటకం
ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరగుతుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్తారు. భగవంతుని ఆరాధించడం వల్ల ధైర్యంగా ఉంటారు. 
సింహం
రహస్య విషయాలు ఎవరికీ చెప్పకండి. మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. పని బాగా జరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈరోజు  ఎక్కువ ఖర్చు చేస్తారు.
కన్య
ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవసరం మేరకు ఖర్చు చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
తుల
మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది.  అందరి మన్ననలు పొందుతారు. ఈ రోజు తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఉద్యోగంలో ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు రావొచ్చు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. 
వృశ్చికం
కొన్ని పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది.  అధిక బాధ్యత కారణంగా మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. సోమరితనం వీడండి.
ధనస్సు
ఆరోగ్యం బాగానే ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు కొత్త పని నుంచి ప్రయోజనం పొందుతారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో సహోద్యోగితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి.
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
మకరరాశి
ఉద్యోగులకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.  వ్యాపారస్తులు కొన్ని పనులపై బయటకు వెళ్లే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు.  విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కొత్త ప్రణాళికలు వేయొద్దు.  
కుంభం
బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు.  కొత్త పనులు కలిసొస్తాయి. బాధ్యతల నుంచి పారిపోవద్దు.  విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు మరింత కష్టపడాలి. వ్యాపారులకు మిశ్రమఫలితాలు ఉంటాయి
మీనం
మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు శత్రువులపై ఆదిపత్యం చెలాయిస్తారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. 
Also Read:  చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి