సాధారణంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఎక్కడ ఏ రూమ్ ఉండాలన్నది చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ కొందరు దేవుడి మందిరం విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఆలోచించరు. ఎక్కడోదగ్గర పెడితేచాల్లే అన్నట్టుంటారు. కొందరు హాల్లో ఓ మూల పెట్టేస్తే..ఇంకొందరు కిచెన్లో చిన్న అల్మరా కేటాయిస్తారు. కొందరి ఇళ్లలో పూజామందిరమే ఉండనప్పుడు వాళ్లు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అయితే పూజామందిరం ఉంటేమాత్రం ఈశాన్యంవైపునే ఉండాలంటారు వాస్తునిపుణులు. పూజకు ప్రత్యేకంగా ఒకరూమ్ కేటాయించినప్పుడే ఇంట్లో ప్రశాంతత ఉంటుందని అలా కాదని కిచెన్లో ఓ మూల ఏదో మమ అనిపిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవని చెబుతారు.
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
దేవుడి గది ఎక్కడ ఉండాలి..ఎలా ఉండాలి..ఎలా ఉండకూడదు
- ఈశాన్యం వైపున్న గదిలో దక్షిణ, పశ్చిమ నైరుతీల్లో పీట వేసిగాని, ఏదైనా మంచి వస్ర్తము వేసి దానిపై పటాలు, ప్రతిమలు ఉంచి పూజించాలి.
- గోడలకు పెట్టాలనుకుంటే మాత్రం దక్షిణ, పశ్చిమ గోడలకు వేలాడదీయాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలకు అల్మరాలు ఉన్నా పటాలు అందులో పెట్టొచ్చు.
- ఈశాన్యం గదిని దేవుడిని ఏర్పాటు చేయడం వీలుకాకుంటే తూర్పు, ఉత్తరంవైపు దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు
- అల్మరాల్లో పెట్టినా కానీ ఆగ్నేయం వైపు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్టరాదు.
- తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా దేవుడి పటాలు, ప్రతిమలు ఉండాలని...పూజించే వారు తూర్పు, ఉత్తరం వైపు తిరిగి పూజ చేయాలని చెబుతారు
- ధ్యానం చేసే అలవాటు ఉన్నవారు మాత్రం తూర్పువైపు తిరిగి చేయడం మంచిదట
- పూజా గదికి ఆనుకుని టాయిలెట్స్ ఉండకూడదు. పైన ఇంట్లో అయినా-కిందింట్లో అయినా...మీ ఇంట్లో పూజాగదికి పైన-కింద టాయిలెట్లు ఉండరాదు
- పూజా గదిపై రూఫ్ వేసి అవసరమైన సామగ్రి వేయడం చేస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే
- పూజ గదిలో ఉండే ఒత్తులు, నూనె డబ్బా అన్ని శుభ్రంగా ఉండాలి
- అగరబత్తి గుచ్చిన అరటిపండ్లు, నూనె బాటిల్ జిడ్డు పట్టి ఉండకూడదని చెబుతారు వాస్తు నిపుణులు
- దీపారధన కుందులకు మసి ఉండకూడదు, వాటినుంచి నూనె కారకూడదు
- అగరుబత్తి గుచ్చిన అరటిపండు నైవేద్యం పెట్టరాదు... పెట్టిన ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు
- మనం కూర్చుని పూజ చేసిన పీట, చాప గాని పూజైన వెంటనే తీసెయ్యాలి లేదంటే వాటిపై దరిద్రదేవత కూర్చుంటుందట
- వాడిన దీపం కుందులు కడగకుండా మళ్ళీ అందులో నూనె పోసి వెలిగించడం చేయరాదు
Also Read: శత్రుదేశంలో శివనామస్మరణ, రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం అక్కడ ప్రత్యేకత..
చిన్నచిన్న విషయాలే మనసులో ప్రశాంతతని పెంచుతాయి..చిన్న చిన్న విషయాలే అలజడి రేపుతాయి. పైన చెప్పినవన్నీ చిన్న మార్పులే అయినప్పటికీ వీటిని సక్రమంగా పాటించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటూ ఐశ్వర్యం నిలుస్తుందని చెబుతారు వాస్తుపండితులు. అయితే ప్రస్తుతం ఉన్న అపార్ట్ మెంట్ కల్చర్ లో కొన్ని తప్పడం లేదనేవారు కొందరైతే...ఏదైనా మన నమ్మకాల ఆధారంగానే ఉంటందనేవారు ఇంకొందరు.
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి