‘రామసేతు’..ఇది ఎప్పటికీ చర్చించుకునే అంశమే.  శ్రీరాముడు వానర సేన సాయంతో నిర్మించాడన్న వాదన ఓవైపు, వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమన్న వాదన మరోవైపు కొనసాగుతున్న సమయంలో ఏడేళ్లక్రితం అమెరికాకు చెందిన సైన్స్‌ చానెల్‌ ఒకటి మొదటి వాదననే సమర్ధిస్తూ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను పరిగణలోకి తీసుకుని ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని, మానవ నిర్మితమైనదేనని తేల్చింది. 
ఇదే ఆ వీడియో..






Also Read:  శత్రుదేశంలో శివనామస్మరణ, రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం అక్కడ ప్రత్యేకత..
రామాయణంలో ఉన్నట్లుగా తమిళనాడు పంబన్, శ్రీలంకలో మన్నార్‌ దీవుల మధ్య సముద్రంలో ఈ వంతెన నిర్మించారని చెబుతారు. రామసేతు, ఆడమ్‌ బ్రిడ్జి అని రెండు పేర్లు కలిగిన ఈ మార్గం సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమా అనే విషయాలపై భారీ చర్చ జరిగింది. ఆ మధ్య అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్స్‌ సంస్థకు చెందిన ‘సైన్స్‌ చానల్‌’ రూపొందించిన ఓ కార్యక్రమంలో 'రామసేతు' నిజంగానే మానవ నిర్మితమేననడానికి ఆధారాలు ఉన్నాయని తేల్చారు. నాసా ఉపగ్రహాల చిత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామంది.  ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినదే కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఆ కార్యక్రమంలో చెప్పారు.  రామసేతు దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ, ఇది మానవుల అద్భుత నిర్మాణమని కార్యక్రమంలో సైన్స్‌ చానల్‌ పేర్కొంది. రామ సేతు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, ఇసుక మాత్రం అంత పాతది కాదని తమ పరిశోధనలో తేలినట్లు మరో శాస్త్రవేత్త చెప్పారు. 
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
కేవలం ఐదు రోజుల్లో నిర్మాణం
సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలోనే బంధించాడని తెలియగానే, వానరసేనంతా దక్షిణ దిక్కుకు కదిలింది. సుగ్రీవుడి ఆదేశాలతో కదిలిన ఆ సేనకు అగ్నిదేవుడు కుమారుడు నీలుడు నాయకత్వం వహించాడు. మహాబల సంపన్నుడైన నీలుడి ఆధ్వర్యంలో వానరసేన సముద్రతీరానికి వచ్చి నిలబడింది. అక్కడ నుంచి లంకకు చేరడం ఎలా అన్న చర్చ మొదలైంది. ఆంజనేయుడితో సమానంగా నీలుడు కూడా సముద్రాన్ని లంఘించగలడు. కానీ మిగతా వానరుల పరిస్థితేంటి? దీనికి వారధి నిర్మించడం ఒకటే మార్గమని నిశ్చయించారు. వానరులు సముద్రంలోకి విడిచిన రాళ్ల మీద రామనామం ఉండటంతో అవన్నీ ఒక్కచోటికి చేరి వారధిగా తయారయ్యాయి. కేవలం ఐదు రోజుల్లోనే 130 కిలోమీటర్ల వారధిని నిర్మించారని చెబుతారు.
Also Read:  ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
భిన్న వాదనలు
రామసేతుపై భిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. మంచు యుగంనాడు భారత్‌, శ్రీలంకను ఇది కలిపేదని కొందరు చెబుతుంటే.. శ్రీలంక, భారత్‌ ఒకప్పుడు కలిసేవుండేవని, 1,25,000 ఏళ్ల కిత్రం ఇవి విడిపోయాయంటున్నారు మరికొందరు.  రావణుడి చెర నుంచి సీతను విడిపించేదుకు శ్రీరాముడు దీన్ని నిర్మించినట్లు రామాయణం చెబుతోంది. సేతు సముద్రం ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు అక్కడ వంతెనే లేదని అప్పటి యూపీఏ ప్రభుత్వం కొట్టిపారేసింది. మన దేశ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి నౌక చేరుకోవాలంటే శ్రీలంకను చుట్టిరావాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా సేతు సముద్రం ప్రాజెక్టును యూపీఏ-1 తెరపైకి తెచ్చింది. రామసేతు గుండా పడవలు ప్రయాణించేలా దీనిలో ప్రాజెక్టులు ప్రతిపాదించారు. దీంతో దాదాపు 350 నాటికల్‌ మైళ్ల ప్రయాణ సమయం కలిసి వస్తుందని అంచనా. దీన్ని సవాల్‌చేస్తూ సుప్రీం కోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై 2008లో సుప్రీం విచారణ చేపట్టింది. అసలు ఈ వంతెన మానవ నిర్మితమా? కాదో తేల్చాలని భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్‌)కి బాధ్యతలు అప్పగించింది. 
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
Also Read: చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు... ఈ మూడు పేర్లు తెలుసా.. అందుకే కన్ఫూజనా..!
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి