నమ్మకం అనేది ఎక్కడివరకైనా నడిపిస్తుందంటారు. పాటించే చిన్న చిన్న విషయాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. నిజంగానే మంచి జరగడానికి అవే కారణమా అని రుజువు చేయలేం కానీ వాస్తు, సెంటిమెంట్స్, దేవుడు పేరుతో కొన్ని పాటించడం వల్ల మానసిక ప్రశాంతత పొందేవారి సంఖ్య ఎక్కువే అని చెప్పొచ్చు. ఫెంగ్ షుయ్ విషయానికొస్తే ఎలా ఉంటే ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుందో చెబుతూ కొన్ని టిప్స్ చెబుతుంటారు. అలాంటి వాటిలో ఒకటి ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ. ఈ బొమ్మ ఇంట్లో, కార్యాలయంలో ఉంటే అన్నీ శుభఫలితాలే అంటారు ఫెంగ్ షుయ్ నిపుణులు. 
Also Read:  శివుడిని తిడుతూ పొగిడిన ఘనత సిరివెన్నెలదే...
ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మ ఉంటే...



  • ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మను ఇంట్లో ఉంచితే ఆ కుటుంబంలో ఆప్యాయతకు లోటుండదు

  • ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ బెడ్ రూమ్ లో పెడితే సంతానలేమి సమస్య తొలగిపోతుంది

  • పిల్లల మెదడు చురుగ్గా పనిచేసి చదువులో ముందుంటారు

  • ఆఫీసులో ఉంచితే మంచి వాతావరణం నెలకొంటుందని, పని చురుగ్గా సాగుతుందని ఫెంగ్ షుయ్ చెబుతోంది

  • జంటగా ఉండే ఫెంగ్ షుయ్ ఏనుగు బొమ్మ బెడ్ రూమ్‌లో పెడితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది

  • ఎనుగుబొమ్మలతో పాటూ పడక గదిలో జంటగా వుండే బాతు బొమ్మలను ఉంచితే భార్యాభర్తల మధ్య ఉన్న విబేధాలు సమసిపోయి సంతోషంగా ఉంటారట.


Also Read: 2022 మరింత అరాచకం.. నోస్ట్రడామస్ భవిష్యవాణి, గతంలోనూ చెప్పిందే జరిగింది..
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఫెంగ్ షుయ్ నిపుణులు ఇవి పాటించాలని చెబుతున్నారు



  • ఇంట్లో పంజరాలు ఉంచకూడదు, పగిలిన వస్తువులు, పాతబడిన వస్తువులను తీసేయాలి

  • ప్రకృతి సిద్ధంగా ఇంట్లోకి వచ్చే వెలుతురుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంత వెలుగునిచ్చే లైట్స్ ఉన్నా పగలంతా ప్రకృతిసిద్ధంగా వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి.

  • బాత్‌రూమ్స్ క్లీన్‌గా ఉంచాలి,  రంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇల్లంతా రంగులతో నింపేయకుండా కేవలం మీకు ప్రశాంతత నిచ్చే మూడు రంగులు మాత్రమే వినియోగించాలి

  • పడక గదిలో టీవీ, కంప్యూటర్స్ లాంటి  భారీ ఎలక్ట్రిక్ వస్తువులను అవైడ్ చేయండి

  • అటాచ్డ్ బాత్‌రూమ్స్ ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంచడం వల్ల చెడు శక్తులను ఇంట్లోకి ఆహ్వానించకుండా బ్రేక్ వేయవచ్చు


Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
ఇవి ఇలాచేస్తేనే మంచి జరుగుతుంది లేదంటే అంతా చెడే జరుగుతుందనే ఆలోచన, భయం అవసరం లేదంటారు ఫెంగ్ షుయ్ నిపుణులు. ఇవన్నీ వారి వారి నమ్మకాలు, విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కటిమాత్రం నిజం...అదేంటంటే పాజిటివ్ మైండ్ ఉన్నప్పుడు ఏం చేసినా అంతా మంచే జరుగుతుంది. అందుకే ఇవి పాటించకపోతే ఏదో జరిగిపోతుందనే భయంతో కాకుండా ఓ రెండు బొమ్మలు పెట్టడమే కదా చేస్తే పోలా అన్నట్టు పాటిస్తే కొన్ని రోజుల్లో ఇంట్లో వాతావరణం ఎలాఉందో మీకుమీరుగానే గమనించండి. ఫెంగ్ షుయ్ నిపుణులు చెప్పింది నిజమైతే మంచి జరుగుతుంది..లేదంటే ఇంట్లో అలంకారానికి పెట్టుకునే బొమ్మల్లో ఇవికూడా ఉంటాయ్ అంతే...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి