భవిష్యత్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం దాదాపు 90శాతం మందికి ఉంటుంది. అది నిజమని నమ్మినా లేకున్నా తెలుసుకుంటే ఏమవుతుందిలే అనే ఆలోచనతో అయినా ఫాలో అయ్యేవారి సంఖ్య ఎక్కువే.  2021కి బైబై చెప్పేసి 2022ని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారంతా. పైగా 2020,2021 తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో రానున్న ఏడాదైనా బావుంటుందనే ఆశతో ఉన్నారు. ఆధునిక యుగంలో భవిష్యత్ ఎలా ఉంటుందన్న దానిపై  ఫ్రాన్స్ జ్యోతిష్యుడు  నోస్ట్రడామస్ చెప్పిన విషయాలను చాలామంది పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటి వరకూ ఆయన చెప్పినవి నిజం కావడంతో 2022 కి సంబంధించి ఏం చెప్పాడో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
1503 డిసెంబర్లో జన్మించిన 'నోస్ట్రాడమస్' అసలు పేరు మిచెల్ డి నోస్ట్రాడమ్.  465 సంవత్సరాల క్రితమే తను రాసిన పుస్తకంలో భవిష్యత్ లో ఏం జరుగుతుందో కవితల రూపంలో రాశాడు. అలా కొన్ని వేల ఘటనలను రాశాడు నోస్టాడామస్. వాటిలో చాలా వరకూ నిజం కావడంతో అప్పటినుంచి తను చెప్పిన విషయాలపై అందరకీ నమ్మకం మొదలైంది. 1555లో మొదటిసారి పబ్లిష్ అయిన ఈ పుస్తకంలో  3797 సంవత్సరం వరకూ ఆయన భవిష్యత్తును అంచనా వేశారు. 
2022లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే..
ధరల పెరుగుదల: 
ఇప్పటికే పెరిగిన ధరలు సామాన్యుడిని ముప్పతిప్పలు పెడుతున్నాయి. 2022లో ధరలు మరింత పెరుగుతాయని నోస్ట్రడామస్ తెలిపాడు. వచ్చే ఏడాది అమెరికా డాలర్ విలువ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందనే అంచనా ఉందని.. అందువల్లే ధరలు పెరుగుతాయంటున్నారు. ఈ లెక్కల బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోతాయంటున్నారు. 
ఉల్కాపాతం 
పొడవైన తోకతో నిప్పురవ్వల్లా మెరిసేవి భూమిని ఢీకొంటాయని నోస్ట్రడామస్ చెప్పాడు. అవి  ఉల్కలు కావొచ్చు,  గ్రహశకలం కూడా కావొచ్చన్నారు. గ్రహశలలాలు భూ వాతావరణంలోకి రాగానే  అక్కడి రాపిడి వల్ల మండుతాయి. అంటే 2022లో అంతరిక్షం నుంచి ముప్పు ఉంది అనుకోవచ్చు. 
ఫ్రాన్స్‌లో కల్లోలం
2022లో ఫ్రాన్స్‌పై ఓ భారీ తుఫాను దాడి చేయనుందనీ... దాని వల్ల వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని పుస్తకంలో ప్రస్తావించారు.  ప్రపంచవ్యాప్తంగా కరవు వస్తుందనీ... ఆహారం కోసం యుద్ధం జరుగుతుందన్నారు.  మరోవైపు నోస్ట్రాడామస్ అంచనా ప్రకారం 2022లో న్యూక్లియర్ బాంబు పేలనుంది. అది ఎక్కడ పేలుతుందనేది చెప్పకపోయినా ఆటంబాంబు మాత్రం భూమిని భారీగా డ్యామేజ్ చేయనుందట.
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
ఇప్పటికే ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వైపు పరుగులుతీస్తోంది. 2022లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం మరింత పెరుగుతుందట. నోస్ట్రడామస్ అంచనా వేశారు. రోబోలు, టెక్నాలజీ యంత్రాలదే పైచేయి అవుతుందట.
ఫ్రాన్స్ ని ముంచెత్తనున్న టోర్నడోలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
2022లో ఫ్రాన్స్ అత్యంత భారీ గడ్డుకాలం ఎదుర్కోనుంది. టోర్నడోలు ముంచెత్తనున్నాయి. భారీగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవచ్చు. భారీ ఎత్తున వరదలు కూడా ఫ్రాన్స్‌ను ముంచెత్తనున్నాయట. 2022లో ప్రపంచం మొత్తం ఆకలితో అలమటిస్తుందని నోస్ట్రాడామస్ పుస్తకంలో ప్రస్తావించారు.
2021 సంవత్సరంలో ప్రపంచం మొత్తం వ్యాధుల బారిన పడుతుందని నోస్ట్రాడామస్ అప్పట్లో చెప్పాడు. కరోనా రూపంలో అది ఓ రకంగా నిజమైంది. దీంతో 2022లో ఏం జరుగుతుందో నోస్ట్రాడామస్ చెప్పిన విషయాలపై అందర్లో మరింత టెన్షన్ పెరిగింది. 
Also Read: శత్రుదేశంలో శివనామస్మరణ, రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం అక్కడ ప్రత్యేకత..
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి