జాతకచక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో ఆయా గ్రహాల ప్రభావం ప్రారంభమవుతుంది.12, 1, 2 స్థానాల్లో శని ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు. ఒక్కోస్థానంలో రెండున్నర సంవత్సరాలు చొప్పున మొత్తం ఏడున్నరేళ్లు ఉంటాడు. ఆ సమయంలో ఆరోగ్యం, చదువు, ఉద్యోగం, ఆరోగ్య పరిస్థితి అన్నింటిపైనా ప్రభావం ఉంటుందంటారు. అయితే చిన్న పిల్లలపై మాత్రం శని ప్రభావం ఉండదని చెబుతారు. అదెందుకు అని చెప్పేందుకు ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది..Also Read: 2022 మరింత అరాచకం.. నోస్ట్రడామస్ భవిష్యవాణి, గతంలోనూ చెప్పిందే జరిగింది..పిప్పలాదుడి వల్లే..పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ చిన్నారి రావిచెట్టు నీడలో తలదాచుకుంటాడు. అందుకే పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. ఆ పిల్లాడిని చూసి జాలిపడిన నారదుడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామమే జీవితానికి వెలుగుచూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. ఆ క్షణం నుంచి ఆ మంత్రం జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...అభినందించేందుకు వచ్చిన నారదుడిని... బాల్యంలో తాను పడిన కష్టాలకు కారణం ఏంటని అడుగుతాడు పిప్పలాదుడు. శనిప్రభావం వల్లే నీకీ పరిస్థితి వచ్చిందని చెప్పడంతో తన తపోబలంతో గ్రహమండలం నుంచి శనిని కిందకు లాగేసిన పిప్పలాదుడు బాల్యంలో ఎవ్వరినీ వేధించవద్దని హెచ్చరించాడట. అంతలో దేవతలంతా అక్కడకు చేరి పిప్పలాదుడికి నచ్చజెప్పడంతో శాంతించి తిరిగి శనిని గ్రహమండలంలో ప్రవేశపెడతాడు ఆ మహర్షి. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే ‘పిప్పలాద మహర్షి’ నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరం ఇస్తాడు.Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..పిప్పలాద ప్రోక్త శని స్తోత్రంకోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమఃశౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః!!నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతేనమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచనమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతేప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ || Also Read: పుక్కిటి పురాణాలు కాదు… ప్రపంచాన్ని నడిపించే దిక్సూచీలు..Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందటAlso Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Saturn Effect: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
ABP Desam | RamaLakshmibai | 01 Dec 2021 05:14 PM (IST)
ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని..ఈ పేర్లు వింటేనే వణికిపోతారు. శని ఏళ్లతరబడి పట్టి పీడిస్తాడని మానసికంగా మరింత కుంగిపోతుంటారు. అయితే చిన్న పిల్లలపై మాత్రం ప్రభావం ఉండదంటారు ఎందుకో తెలుసా.
పిల్లలపై శనిప్రభావం