మోసం చేసే వాళ్ల మొదటి లక్షణం అబద్ధాలు చెప్పడం. ఎలాంటి దగా, మోసం అయినా మొదలయ్యేది ఒక చిన్న అబద్ధంతోనే. చాలా సమర్థవంతులే ఇలాంటి పనులకు దిగుతారు. అందుకే వారు చెప్పే అబద్ధాలను కనిపెట్టడం కష్టమే. కానీ కొన్ని సంకేతాలు, బాడీ లాంగ్వేజ్ ద్వారా అబద్ధాలను గుర్తు పట్టొచ్చంటున్నారు సైకాలజిస్టులు. ఇక్కడ మేము అబద్ధాలకోరులను గుర్తు పట్టే కొన్ని లక్షణాలు ఇచ్చాము. ఇవి మీకు జీవితంలో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. 


1. కళ్లల్లోకి నేరుగా చూడరు
నిజం చెబుతున్నప్పుడు నేరుగా కళ్లల్లోకి చూసే ధైర్యం వస్తుంది. కానీ అబద్ధం చెప్పేటప్పుడు మాత్రం మన మెదడు, శరీరం కళ్లల్లోకి చూసేంత ధైర్యాన్ని ఇవ్వవు. దగాకోరులు అబద్ధం చెప్పేటప్పుడు మీ కళ్లలోకి చూడకుండా ఇటూ అటూ చూస్తూ మాట్లాడతారు. అబద్ధం చెప్పటప్పుడు కళ్లు ఆర్పడం కూడా ఎక్కువగా చేస్తారు. 


2. బాడీ లాంగ్వేజ్
ఒక వ్యక్తి బాడీ లాంగ్వేజ్ కూడా అతని గురించి చెప్పేస్తుంది. అబద్ధం చెబుతున్న వ్యక్తి చేతులను కనిపించకుండా పాకెట్లో పెట్టుకోవడమో, వెనక్కి పెట్టుకోవడమో చేస్తారు. అలాగే పాదాలను కూడా బలంగా నేలకు నొక్కడం, పెదాలను పదే పదే వింతవింతగా నోట్లోకి లాక్కుని వదలడం వంటి చేష్టలు చేస్తారు. కానీ అవన్నీ మాట్లాడే పద్ధతి అనుకుంటారు ఎదుటివాళ్లు. 


3. మాట్లాడే విషయం మారిపోతుంది
అబద్ధాలకోరు ఎల్లప్పుడు మాట్లాడే విషయాన్ని త్వరగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. అబద్ధాలు చెప్పేటప్పుడు వారు బలహీనంగా భావిస్తారు. కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడలేక సబ్జెక్ట్ మార్చేస్తారు. తద్వారా వారి అబద్ధాలు బయటపడవు, ఎదుటివారు సత్యాన్ని గ్రహించలేరు. 


4. స్వయంరక్షణ ఎక్కువ (డిఫెన్సివ్‌నెస్)
అబద్ధాలు చెప్పే వ్యక్తులకు సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎదుటివారు ప్రశ్నించేలోపే స్పందిస్తారు. ప్రశ్నలతో తిరిగి మీపైనే దాడికి దిగుతారు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరిస్తారు. సంభాషణను మళ్లించేందుకు ప్రయత్నిస్తారు. 


5. చెమటలు
అబద్ధాలు చెప్పే సమయంలో వారు ఒత్తిడికి గురవుతారు. ఆత్రుతగా కనిపిస్తారు. దీనివల్ల వారికి చెమటలు పడతాయి. చెమటలు పట్టడం అనేది భయపడినప్పుడు, అబద్ధం చెప్పినప్పడు, అతిగా ఒత్తిడి కలిగినప్పుడు పడుతుంది. మీతో మాట్లాడే వ్యక్తికి ఎందుకు చెమటలు పడుతున్నాయో ఆ సందర్భాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. 


6. శ్వాస సాధారణంగా ఉండదు
అబద్ధం చెబుతున్నప్పుడు వారి శ్వాస సాధారణంగా ఉండదు. నెమ్మదిగా లేదా చాలా వేగంగా మారుతుంది. ఎందుకంటే వారికి నెర్వస్ గా అనిపించడం, లేదా ఒత్తిడి కలగడం జరిగినప్పుడు హృదయ స్పందన రేటు తీవ్రంగా పెరుగుతుంది. దీన్ని బట్టి ఆ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడా లేదా అన్నది మీరే గుర్తించాలి. 


Read Also: వాషింగ్ మెషీన్లతో పిరమిడ్... ఎన్ని వాషింగ్ మెషీన్లు వాడారో తెలుసా?


Read Also: గుడ్డుతో పాటూ వీటిని తినకూడదు, తింటే ఈ సమస్యలు తప్పవు
Read Also:  ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
Read Also:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Read Also:  ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...
  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి