కరోనా వచ్చాక ఆహారంపై, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెరిగింది జనాల్లో. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం గురించి, పోషకాలు నిండిన పదార్థాల గురించి వెతికి మరీ తెలుసుకుంటున్నారు. అందుకే చాలా మంది నాన్ వెజిటేరియన్లు సాధారణ చికెన్ కన్నా, నల్లకోడి మాంసాన్ని తినేందుకు ఇష్టపడుతున్నారు. వీటిని ‘కడక్ నాథ్’ అని, ‘కాళి మాసి’ అని పిలుస్తారు. ఇవి మధ్యప్రదేశ్ లోని ఝబువా ప్రాంతానికి చెందినవి. ఇప్పుడు వీటిని అక్కడ్నించి తీసుకెళ్లి చాలా చోట్ల పెంచుకుంటున్నారు. బ్లాక్ కోడి రకాల్లో ఇదీ ఒకటి. వీటి జాతివే చైనాలో సిల్కీ అని, ఇండోనేషియాలో అయామ్, సెమానీ అని జీవిస్తున్నాయి. 


ఈ కోడి మామూలుది కాదు...
కడక్‌నాథ్ జాతి కోళ్లు భారతీయ వాతావరణంతో బాగా ఇమిడిపోయాయి. ఎటువంటి యాంటీ బయాటిక్స్ లేకుండా తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని బతకగలదు. దీన్ని మాంసం నుంచి రక్తం వరకు, నరాల నుంచి ఈకల వరకు మొత్తం నలుపు రంగే. గుడ్లు కూడా నలుపు రంగులోనే ఉంటాయి. 


పోషకాలు ఎక్కువ
1. సాధారణ చికెన్ తో పోలిస్తే పాతిక శాతం ఎక్కువ ప్రోటీన్ దీనిలో ఉంటుంది. విలక్షణ రుచితో నాన్ వెజ్ ప్రియులకు చాలా నచ్చుతుంది. ఈ మాంసంలో 18 అమైనో ఆమ్లాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఆమ్లాలు మన శరీరానికి అత్యవసరమైనవి. 
2. సాధారణ చికెన్లో ఉండే లినోలిక్ యాసిడ్ పరిమాణంతో పోలిస్తే బ్లాక్ చికెన్లో 24 శాతం ఎక్కుడ లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనది. 
3. ఈ చికెన్లో మనకు అత్యవసర విటమిన్లయిన సి, ఇ, బి1, బి2, బి6, బి12, నియాసిన్, కాల్షియం, ఫాస్పరస్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్ కు ఇది మంచి మూలం. 


ఆ రోగులకు చాలా మంచిది
మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అధ్యయనంల ప్రకారం ఈ కోడి మాంసం, గుడ్లు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు చాలా మంచిది. అయితే వీటిని కొత్తగా తినడం ప్రారంభిస్తున్నట్లయితే ఓసారి వైద్యనిపుణుల సంప్రదించి మొదలుపెట్టండి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ మాంసం చాలా మేలు చేస్తుంది. 


బొల్లివ్యాధిగ్రస్తులకు...
ఈ  బ్లాక్ చికెన్ రక్తంలో మెలనిన్ ఉండటం వల్ల అది బొల్లి వ్యాధితో బాధపడేవారికి మేలు చేస్తుంది.  వారు వారానికి ఓసారైనా ఈ మాంసాన్ని తింటే మంచిది.  


నల్లగుడ్లతో మేలు
కడక్ నాథ్ గుడ్లు సహజంగానే ప్రొటీన్లు, పోషకాలకు నిలయం. తలనొప్పి, ఉబ్బసం, నెఫైట్రిస్ వంటివ సమస్యలను దూరం చేస్తాయి. 


Read Also: అబద్ధాలకోరును ఇలా గుర్తించండి... మోసపోకుండా జాగ్రత్త పడండి


Read Also: వాషింగ్ మెషీన్లతో పిరమిడ్... ఎన్ని వాషింగ్ మెషీన్లు వాడారో తెలుసా?


Read Also: గుడ్డుతో పాటూ వీటిని తినకూడదు, తింటే ఈ సమస్యలు తప్పవు
Read Also:  ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
Read Also:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Read Also:  ల్యాప్‌టాప్‌ను డిటెర్జెంట్‌తో ఉతికేసిన భార్య, ఆమె అతి శుభ్రత జబ్బుతో వేగలేనంటున్న భర్త, వీరి కథలో ఎన్ని ట్విస్టులో...
  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి