టీమ్‌ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేయడంలో అతడిదే కీలక పాత్ర అని పేర్కొంటున్నారు. ఓపెనర్లను త్వరగా పెవిలియన్ పంపించడంతోనే భారత్ పైచేయి సాధించిందని పొగుడుతున్నారు. పైగా అతడు బౌలింగ్ చేసిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.
న్యూజిలాండ్ జట్టు టాప్ ఆర్డర్లో టామ్ లేథమ్, విల్ యంగ్, రాస్ టేలర్ అత్యంత కీలకమైన ఆటగాళ్లు. తొలి టెస్టులో ఓపెనర్లు లేథమ్, విల్‌యంగ్ ఎంత అద్భుతంగా ఆడారో అందరికీ తెలిసిందే. టీమ్‌ఇండియా పేస్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండు ఇన్నింగ్సుల్లో శుభారంభాలు అందించారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం జట్టు స్కోరు 10 వద్ద ఓ అద్భుతమైన బంతికి విల్‌యంగ్‌ను ఔట్ చేశాడు. విరాట్ కోహ్లీ డైవ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.
ఇక టామ్ లేథమ్‌ను ఔట్ చేసిన తీరుకు అభిమానులు ఫిదా అయ్యారు. మిడిలార్డర్లో అత్యంత సీనియర్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే రాస్ టేలర్‌ను ఏకంగా బౌల్డ్ చేసేశాడు. దాంతో కివీస్ 17కే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అశ్విన్ రెచ్చిపోయాడు. ప్రస్తుతం సిరాజ్ వికెట్లు తీసిన వీడియోలు, చిత్రాలు వైరల్‌గా మారాయి.
Also Read: Ganguly on Laxman: హైదరాబాద్‌ను వదిలేస్తున్న వీవీఎస్.. మా లక్ష్మణ్ బంగారం అంటున్న గంగూలీ!
Also Read: Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి