చొప్పదండిలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అనారోగ్యం పాలైన విద్యార్థులు నెమ్మదినెమ్మదిగా కోరుకుంటున్నారు. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన పిల్లల పేరెంట్స్ స్కూల్ కి వచ్చి వారి పిల్లల్ని సెలవుపై తీసుకెళ్తున్నారు. స్కూలు సిబ్బంది నిర్వాకం వల్లే ఇంత దారుణం జరిగిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే తమ పిల్లల్ని ఆసుపత్రికి తరలించారని అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియక తీవ్రమైన ఆందోళనకు గురి అయ్యామని తల్లిదండ్రులు అంటున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన పట్ల వివిధ ప్రజా సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. గతంలో ఇంచార్జి గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదని, ప్రభుత్వం కూడా పేద వర్గాల నుండి వచ్చినటువంటి పిల్లలపై నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. సదరు ఆహారపదార్థాలను సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోకుంటే తాము రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం అవుతామని వారు హెచ్చరించారు.
మరోవైపు, ఈ ఘటన జరిగినప్పటికీ కూడా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిల్లల్ని కనీసం పరామర్శించిన పోవడంపై పేరెంట్స్ కమిటీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కువయ్యాయని పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తులసి అన్నారు.
అయితే, పిల్లలు వరుసగా అస్వస్థతకు గురికావడంతో తాము కూడా ఆందోళన చెందామని, దీంతో పేరెంట్స్‌కి సరైన సమయంలో సమాచారం ఇవ్వలేకపోయామని పాఠశాల ప్రిన్సిపల్ స్వాతి తెలిపారు. చాలా మంది పిల్లలు వాంతుల తరువాత కోలుకున్నారని, హాస్పిటల్‌లో ఉంచి మళ్లీ మెరుగైన వైద్యం అందించామని వారు చెబుతున్నారు. ఈ సంఘటన పట్ల పూర్తి స్థాయిలో అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తున్నామని, ఫుడ్ పాయిజన్ జరిగిన శాంపిల్స్ ఇప్పటికే ల్యాబ్‌కి పంపించామని తెలిపారు. రిపోర్టులు వచ్చిన తరువాత తప్పు ఎక్కడ ఉందో సదరు సిబ్బందిపై లేదా కాంట్రాక్టర్లపై తప్పకుండా కఠిన చర్యలకు సిఫార్సు చేస్తామని ప్రిన్సిపల్ స్వాతి చెప్పారు.
Also Read: Sand Theft Detection: వారెవ్వా.. ఇసుక మాఫియాను అరికట్టే పరికరం కనిపెట్టిన విద్యార్థిని
Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..