మేషం
కొత్త పని ప్రారంభించేందుకు మేషరాశివారికి అనుకూల సమయం. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. మీ ప్రవర్తనతో అందర్నీ మెప్పిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు రిస్క్ తీసుకోవద్దు. ఉద్యోగస్తులు, విద్యార్థులకు శుభసమయం.  ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు ఎరుపు.
వృషభం
జీవిత భాగస్వామితో కొన్ని వివాదాలు తలెత్తుతాయి. ఎవరినీ అతిగా నమ్మొద్దు. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించవచ్చు. కార్యాలయంలో సహోద్యోగుల పనితీరుపై కొంత నిరాశ చెందుతారు.  ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు తెలుపు.
మిధునం
ఇంటికి బంధువులు రావొచ్చు. వైవాహిక సంబంధాల్లో మధురానుభూతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వృత్తిృ -వ్యాపారంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు పసుపు.
Also Read: రోజూ ఇంటిముందు ముగ్గేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా మరి..
కర్కాటకం
మీరు ఓ పెద్ద పనిలో భాగస్వామ్యమవుతారు. ఇంటి అలంకరణపై ఆసక్తి చూపిస్తారు. సామాజికంగా ప్రశంసలు అందుకుంటారు. కష్టమైన సమస్యలు కొన్నింటికి ఆచరణాత్మకమైన పరిష్కారాలు కనుక్కోండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. కొంతమంది అసూయతో మిమ్మల్ని విమర్శిస్తారు. . ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు తెలుపు.
సింహం
సింహ రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. స్నేహితులను కలిసే అవకాశం లభిస్తుంది. పిల్లల కోసం సమయం వెచ్చిస్తారు. కార్యాలయంలో పనులున్నీ ఎలాంటి ఆటంకం లేకుండా ఉద్యోగులు పూర్తిచేస్తారు. రిస్క్ తీసుకోవద్దు. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు బంగారు వర్ణం.
కన్య
అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. వ్యాపారంలో పెద్ద మార్పులు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. ఇంట్లో కొన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. మనసులో ఏదో అస్థిర భావన ఉంటుంది. వాతావరణంలో మార్పుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త ఆదాయ మార్గాలు పొందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. మీకు ఈరోజు కలిసొచ్చే రంగు  ఆకుపచ్చ.
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
తుల
మీరు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. నిర్మాణ సంబంధిత పనులపై ఆసక్తి ఉంటుంది. పెద్ద బాధ్యత స్వీకరిస్తారు. మతపరమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఏకాగ్రతతో పని చేస్తే విజయం లభిస్తుంది. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.  ఈ రోజు  మీకు కలిసొచ్చే రంగు  తెలుపు.
వృశ్చికం
ఈరోజంతా సంతోషంగా ఉంటారు. రాజకీయ నాయకులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబంలో అనవసరమైన కలహాల కారణంగా మనస్సు కలత చెందుతుంది. సహోద్యోగుల ప్రవర్తన పట్ల మీరు అసంతృప్తిగా ఉంటారు. మీరు దంత వ్యాధుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. ఈ రోజు  మీకు కలిసొచ్చే రంగు  ఎరుపు.
ధనస్సు 
మీ స్వభావం అందరికీ నచ్చుతుంది.  ఉద్యోగంలో బదిలీ ఉండొచ్చు. వ్యాపారం జోరందుకుంటుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ప్రేమ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. చాలారోజులుగా నిలిచిపోయిన మొత్తం మీ చేతికందుతుంది.  ఈ రోజు  మీకు కలిసొచ్చే రంగు పసుపు.
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
మకరం
చేపట్టిన పని పూర్తి చేయడంలో చాలా బిజీగా ఉంటారు. మీరు ఆకస్మిక యాత్రకు వెళ్ళే అవకాసం ఉంది. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా కృషి చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఖర్చు చేయండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
మీకు ఈ రోజు కలిసొచ్చే రంగు నీలం.
కుంభం
ఈ రోజంతా ఏవో  పాత జ్ఞాపకాల్లోకి  వెళ్లిపోతారు. మీ ఆలోచనలను జీవిత భాగస్వామితో పంచుకుని చాలా సంతోషంగా ఉంటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. రచనలతో సంబంధం ఉన్న వ్యక్తుల సృజనాత్మకత పెరుగుతుంది. పని ప్రదేశంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు నీలం.
మీనం
ఈ రోజంతా మీన రాశివారికి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు పెద్దల అభిప్రాయం తీసుకోండి. నిలిచిపోయిన పనులు మళ్లీ పుంజుకుంటాయి. మిత్రుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు శుభసమయం. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు పసుపు.
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి