ముగ్గు ఎందుకు వేయాలంటే...
- ఇంటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా అడ్డుకోవడమే కాదు ఇంట్లోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయట.
- ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం. అందుకే పండుగల సమయంలో ఇలా వేయాలంటారు పెద్దలు.
- దేవుడి పూజ చేసే సమయంలో పీటపై మధ్యలో చిన్న ముగ్గువేసి నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పనిసరిగా గీయాలట.
- నక్షత్రం ఆకారంలో వేసే ముగ్గు నెగెటివ్ వైబ్రేషన్స్ ని దరిదాపులకు రాకుండా చేస్తుందట.
- ఇంటి ముందు వేసే పద్మం ముగ్గు కేవలం గీతలు కాదు..ఆ ముగ్గువెనుక యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలు ఉంటాయని తద్వారా చెడుశక్ని ఆపుతుందని చెబుతారు.
- దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.
Also Read: పూటకో రూపం.. అక్కడ అమ్మవారిని టచ్ చేస్తే ప్రళయం తప్పదట.. - దేవాలయంలో నిత్యం ముగ్గువేసే స్త్రీకి ఏడు జన్మల వరకూ వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తారని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.
- నిత్యం ముగ్గులు వేయలేక పెయింట్ లు పెట్టేస్తుంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.
- ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు తప్పనిసరిగా వేస్తే దైవ శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తుందని పెద్దలు చెబుతారు.
- ముగ్గు ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేరో చెప్పే సూచనగా చూసేవారు అప్పట్లో. ఎందుకంటే సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ప్రతి ఇంటికీ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటిముందు ముగ్గులేకపోతే ఆ ఇంటికి వెళ్లేవారు కాదట.
- ఇంటి తలుపులు తెరిచి ఉన్నా ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు ఆ అంటినుంచి బిక్ష స్వీకరించేవారు కాదట. అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసిన వెంటనే ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన తర్వాత ఏ సమయం అయినా ముగ్గువేస్తారు
- ఇల్లంతా కడిగిన తర్వాత ముగ్గువేయకుండా వదిలేస్తే అది అశుభానికి సూచన అంటారు పండితులు
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్గా ఉందిగా!
Also Read: మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉన్నాయా… అయితే దురదృష్టాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే..
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
Also Read: ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి