లావాదేవీలపై ఆర్థిక సంస్థలన్నీ పరిమితులు విధిస్తున్నాయి. ఇంతకు ముందే బ్యాంకులు ఏటీఎం విత్‌డ్రావల్స్‌పై రుసుములు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (IPPB) సైతం ఇదే బాటలో నడిచింది. లావాదేవీలపై పరిమితులు విధించి రుసుములు పెంచింది. 2022, జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.


కొత్త ఏడాది నుంచి సాధారణ సేవింగ్స్‌ ఖాతాపై నెలకు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా విత్‌డ్రా చేసుకొనేందుకు వీలుంది. అంతకు మించి లావాదేవీలు చేపడితే ఒక్కో లావాదేవీపై కనీసం రూ.25 లేదా విత్‌డ్రా చేసే మొత్తంలో విలువపై 0.50 శాతం రుసుము వసూలు చేస్తారు. పైగా జీఎస్‌టీ, సుంకాలు అదనంగా ఉంటాయి. నగదు డిపాజిట్లపై మాత్రం ఎలాంటి రుసుములు విధించరు.


సాధారణం కాకుండా మిగిలిన సేవింగ్స్‌, కరెంట్‌ ఖాతాల నుంచి నెలకు రూ.25,000 వరకు ఉచితంగా లావాదేవీలు చేయొచ్చు. పరిమితి దాటితే ఒక్కో లావాదేవీపై రూ.25 లేదా విత్‌డ్రా చేసే మొత్తం విలువపై 0.50 శాతం వరకు రుసుము తీసుకుంటారు. మరో విషయం ఏంటంటే ఈ ఖాతాల్లో నెలకు రూ.10,000 వరకు చేసే డిపాజిట్లపై ఫీజు తీసుకోరు. లిమిట్‌ దాటితే మాత్రం రూ.25 లేదా 0.50 శాతం రుసుము చెల్లించక తప్పదు.


పోస్టాఫీసు ఏటీఎం లావాదేవీలపై అక్టోబర్లోనే పరిమితులు విధించి రుసుములు పెంచిన సంగతి తెలిసిందే.


Also Read: చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!


Also Read: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్‌ పిరియడ్‌ సర్వ్‌ చేయకుంటే పన్ను పడతాది!


Also Read: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్‌ తెలుసా?


Also Read: ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!


Also Read: త్వరపడండి..! ఈ గవర్నమెంట్‌ కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 8.77% వడ్డీ ఇస్తోంది


Also Read: కస్టమర్లకు బ్యాంకుల షాక్‌..! ఏటీఎం లావాదేవీల ఫీజు పెంపు


Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!


Also Read: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?


Also Read: బిగ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టేందుకు అశ్విన్‌ రెడీ..! ఏంటో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి