వినియోగదారులకు బ్యాంకులు మరో షాక్‌ ఇచ్చాయి! ఏటీఎం లావాదేవీల రుసుములు పెంచుతున్నాయి. 2022, జనవరి 1 నుంచి ఉచితం కన్నా ఎక్కువసార్లు ఏటీఎం ఉపయోగిస్తే ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం లావాదేవీల రుసుములు పెంచుకొనేందుకు రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం.


ఉచితాన్ని మించితే
ఏటీఎం లావాదేవీలు చేసేందుకు బ్యాంకులు ఎప్పట్నుంచో పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఐదు వరకు నగదు, నగదుయేతర లావాదేవీలను ఉచితంగా అందిస్తున్నాయి. ఇందులో మూడు వరకు ఇతర బ్యాంకు ఏటీఎంలలో చేయొచ్చు. మెట్రో నగరాల్లో అయితే రెండుసార్లు చేసుకోవచ్చు. అయితే పరిమితి దాటేసి ఎక్కువసార్లు ఏటీఎం లావాదేవీలు చేపడితే ఒక్కో లావాదేవీకి జనవరి నుంచి రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్‌ వరకు ఇది రూ.20గానే ఉండనుంది.


ఆర్‌బీఐ నోటిఫికేషన్‌
'తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో వినియోగదారులు ఐదుసార్లు లావాదేవీలను ఉచితంగా చేపట్టొచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలనూ ఉచితంగా వాడుకోవచ్చు. మెట్రో నగరాల్లో అయితే మూడు, నాన్‌ మెట్రో అయితే ఐదుసార్లు ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు. పరిమితిని మించి వాడితే ఒక్కో లావాదేవీకి రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని లావాదేవీకి రూ.21 రుసుము విధించుకొనేందుకు బ్యాంకులకు అనుమతి ఇస్తున్నాం. 2022, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వీటిపై పన్నులు (ఉంటే..!) అదనం' అని ఆర్‌బీఐ గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చింది.


కస్టమర్లకు అవగాహన
ఏటీఎం లావాదేవీల రుసుముల పెరుగుదల గురించి కొన్ని బ్యాంకులు ఇప్పటికే వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఉచిత లావాదేవీల పరిమితి తర్వాత ఒక్కో దానికి రూ.21+ పన్నులు వర్తిస్తాయని చెబుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి బ్యాంకులు ఇప్పటికే వెబ్‌సైట్లలో సమాచారం ఉంచాయి.


ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంపు
ఇక ఒక్కో లావాదేవీకి ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును పెంచుకొనేందుకు 2021, ఆగస్టు 1న బ్యాంకులకు కేంద్ర బ్యాంకు అనుమతి ఇచ్చింది. ఆర్థిక లావాదేవీలకు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలకు రూ.5 నుంచి రూ.6కు పెంచుకొనేందుకు ఆమోదం తెలిపింది.


Also Read: December Financial Changes: డిసెంబర్లో డబ్బు పరంగా జరిగే మార్పులివే..! లేదంటే..!


Also Read: GST Collections: చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!


Also Read: GST on Salary: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్‌ పిరియడ్‌ సర్వ్‌ చేయకుంటే పన్ను పడతాది!


Also Read: SBI ATM Withdrawal Rule: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్‌ తెలుసా?


Also Read: Banks Money : ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి