ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజుల కిందట దుమారం రేపాయి. ఈ విషయంపై ఏపీలో ఇప్పటికీ అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం కొనసాగుతూనే ఉంది. భువనేశ్వరిపై వ్యాఖ్యల ఘటనపై తెలంగాణ టీఆర్ఎస్ నేత మల్లాది వాసు స్పందిస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మల్లాది వాసు వ్యాఖ్యలకు మద్దుతుగా అనంతపురం జిల్లాలో వెలసిన ప్లెక్సీలు సంచలనంగా మారాయి.


తెలుగింటి ఆడపడుచు కించ పరిచేలా ప్రవర్తించిన నేతలకు బుద్ది చెప్పేలా వ్యాఖ్యలు చేసిన మల్లాది వాసుకు శుభాకాంక్షలు అంటూ హిందూపురం పరిటాల అభిమానసంఘం, ధర్మవరం పరిటాల అభిమాన సంఘం, ఉరవకొండ పరిటాల అభిమాన సంఘం, అనంతపురం మల్లాదివాసు ఫ్యాన్స్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి.ఈ ఫ్లెక్సీల వెనుక వున్నది ఎవరో కానీ అనంతపురం.. బళ్లారి హైవేపై ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకొన్నారని స్థానికంగా చెప్పుకుంటున్నారు. సీసీ కెమెరాలు లేని చోట్ల మాత్రమే మల్లాది వాసుకు మద్దతు తెలుపుతూ పరిటాల అభిమాన సంఘం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.



భువనేశ్వరిపై వ్యాఖ్యల వివాదం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు ఆశించిన స్థాయిలో స్పందించలేదని రాష్ట్ర టీడీపీ శ్రేణులు భావించాయి. అలాంటి సమయంలో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేత మల్లాది వాసు తీవ్ర వ్యాఖ్యలతో బదులివ్వడం సంచలనంగా మారింది. దీంతో రెండు రాష్ట్రాల్లో మల్లాది వాసు వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో అనంతపురంలో ఆయనకు మద్దతుగా పరిటాల అభిమాన సంఘం పేరుతో ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ ఫ్లెక్సీలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పరిటాల కుటుంబం చెబుతోంది. తమ కుటుంభానికి చెడ్డపేరు తెచ్చే విధంగా కొందరు వీటిని ఉద్దేశ్యపూర్వకంగానే ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. బలహీనపడిన జవాద్ తుపాను.. ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఒడిశా, బెంగాల్‌‌లో కుంభవృష్టి


అధికార వైఎస్సార్‌సీపీ నేతలపై తమ కోపాన్ని ప్రదర్శించేందుకు టీడీపీ కార్యకర్తలు ఇలా చేశారా.. లేక పరిటాల కుటుంబాన్ని వివాదంలోకి లాగేందుకు ఎవరైనా ఈ పని చేశారా తేలాల్సి ఉంది. టీడీపీ నేతలపై ఆగ్రహంతో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉండొచ్చుననే భిన్న వాదనలున్నాయి. అనంతపురం జిల్లాలో ఇప్పుడు మల్లాది వాసుకు మద్దతు ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి.  ఇంకా వీటిని తొలగించలేదు. రాజకీయ వివాదం మరింత ముదిరే నేపథ్యంలో ఇది ఎవరు చేశారో పోలీసులు తేల్చాల్సి ఉంటుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి