ఇటీవల బ్రిటన్‌ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెకు ఒమిక్రాన్ వేరియంట్ అని అంతా ఆందోళన పడ్డ సంగతి తెలిసిందే. వెంటనే ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ పరీక్షకు పంపారు. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన ఆ మహిళకు ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ రిపోర్టులో మహిళకు నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. కాగా మరో 12 మంది బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల జీనోమ్‌ రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ ఫలితంలో నెగెటివ్‌ వచ్చిన మహిళకు కరోనా నిర్ధరణ కావడంతో ఆమె ప్రస్తుతం టిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెల్లడైన ఫలితంలో మహిళకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకలేదని తేలడంతో ఇప్పటిదాకా హైదరాబాద్‌లో ఒక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో అంతా ఊరట చెందుతున్నారు. 


మరోవైపు, ఒమిక్రాన్ వేరియంట్ గురించి తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం కీలక ప్రకటన చేశారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుందని.. కొవిడ్‌ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమని డీహెచ్ అన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశామని వెల్లడించారు. నిన్న ఒక్క రోజే 3.7 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. నెలాఖరులోపు 100 శాతం వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించామని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు.


విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు 900 మందికి పైగా విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్నారని.. అందులో 13 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ ఉందా లేదా అనే విషయం ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుందన్నారు. దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న కొవిడ్ కేసుల్లో.. కరోనా కేసులు 8నుంచి 16 శాతానికి చేరాయని డీహెచ్ డా.శ్రీనివాసరావు తెలిపారు. 75 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయన్నారు. 


Also Read: Sircilla: సిరిసిల్ల యువకుడి వినూత్న ఆవిష్కరణ.. ట్రక్కులు తిరిగి ఖాళీగా రాకుండా అద్భుత ప్లాన్


Also Read: Konijeti Rosaiah: ముగిసిన రోశయ్య అంత్యక్రియలు.. కొంపల్లి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు పూర్తి


Also Read: DH Srinivasa Rao: ఒకట్రెండు నెలల్లో భారత్‌ లో కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి