దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న కొవిడ్ కేసుల్లో.. కరోనా కేసులు 8నుంచి 16 శాతానికి చేరాయని డీహెచ్ డా.శ్రీనివాసరావు తెలిపారు. 75 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయన్నారు. కొవిడ్ ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని అన్నారు. వైరస్‌ నియంత్రణలో ప్రజలదే ముఖ్యపాత్ర అని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ఒకట్రెండు నెలల్లో భారత్‌ లో కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఇండియాలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కొవిడ్ నిబంధనలు మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తెలిసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అక్కడ కేసులు పెరిగినా ఆస్పత్రులో చేరికలు, మరణాలు పెరగడం లేదన్నారు.


థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం తగ్గుతుందని.. . కొవిడ్‌ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమని డీహెచ్ అన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశామని వెల్లడించారు. నిన్న ఒక్క రోజే 3.7 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.  నెలాఖరులోపు 100శాతం వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించామని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు.


విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు 900 మందికి పైగా విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్నారని.. అందులో 13 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ ఉందా లేదా అనే విషయం ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుందన్నారు.


దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 5 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, ముంబయి, గుజరాత్‌, దిల్లీలో ఈ కేసులు వెలుగుచూశాయి. టాంజానియా నుంచి దిల్లీకి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ స్పష్టమైంది. వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను వెతికే పనిలో ఉన్నారు అధికారులు. అనుమానితుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ ఫలితాలు ఇంకా రాలేదు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని కానీ దాని వల్ల ఇప్పటివరకు ఎక్కడా మరణాలు సంభవించలేదని నిపుణులు అంటున్నారు.


Also Read: Omicron Cases in India: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు


Also Read: Omicron Fear: భార్య, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేసిన డాక్టర్.. కారణం తెలిసి పోలీసులు షాక్! 


Also Read: Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'