ముంబయి టెస్టులో న్యూజిలాండ్‌కు ఇక కష్టమే! ఆ జట్టుకు టీమ్‌ఇండియా 540 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. 276/7 వద్ద కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అర్ధశతకంతో అదరగొట్టాడు. చెతేశ్వర్ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6), శుభ్‌మన్ గిల్ (47; 75 బంతుల్లో 4x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నారు. అక్షర్ పటేల్ (41*; 26 బంతుల్లో 3x4, 4x6) అజేయంగా నిలిచాడు. మొత్తంగా కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఈ మ్యాచులో 14 వికెట్లు తీశాడు.
ఓవర్‌నైట్ స్కోరు 69/0తో మూడోరోజు టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆరంభించింది. 38 పరుగులతో క్రీజులోకి వచ్చిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్ అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా 29 పరుగులతో బ్యాటింగ్ చేపట్టిన చెతేశ్వర్ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరినీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేలే ఔట్ చేయడం గమనార్హం. జట్టు స్కోరు 107 వద్ద మయాంక్, 115 వద్ద పుజారాను అతడు పెవిలియన్ పంపించాడు.
ఓపెనర్లు ఔటయ్యాక శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ (36; 84 బంతుల్లో 1x4, 1x6) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్‌కు 144 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కీలక సమయంలో అర్ధశతకం ముందు గిల్‌ను రచిన్ రవీంద్ర ఔట్ చేయడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శ్రేయస్ అయ్యర్ (14), విరాట్ కోహ్లీ ఔటయ్యారు. అయితే అక్షర్ పటేల్ వేగంగా ఆడి సిక్సర్లు బాదేయడంతో టీమ్‌ఇండియా 276/7కి డిక్లేర్ చేసింది.
Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్.. కిర్రాక్! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్!
Also Read: PV Sindhu: వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరిన సింధు.. ప్రత్యర్థి ఎవరంటే?
Also Read: Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?
Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి