న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ భారత్‌తో జరిగిన రెండో టెస్టులో 10కి 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అతనికి వాంఖడే స్టేడియంలో స్టాండింగ్ ఒవేషన్ లభించింది. పలువురు భారత అభిమానులు నిలబడి చప్పట్లు కొడుతున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇదే వీడియోలో అశ్విన్ కూడా నిలుచుని చప్పట్లు కొడుతుండగా.. చివరిలో అజాజ్ బంతితో అభివాదం చేశాడు.
వాంఖడే స్టేడియంలో అజాజ్ సృష్టించిన రికార్డు మామూలుది కాదు. 1956లో జిమ్ లేకర్, 1999లో అనిల్ కుంబ్లే మాత్రమే దీన్ని సాధించగలిగారు. ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు కూడా. కేవలం సమం చేయడం మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఒక ఇన్నింగ్స్‌లో 10 కంటే ఎక్కువ వికెట్లు తీయడం సాధ్యం కాదు కాబట్టి.
ఇక భారత్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకే పరిమితం చేసిన న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. సిరాజ్ మూడు, అక్షర్ పటేల్ రెండు, జయంత్ యాదవ్ ఒక్క వికెట్ తీశారు. అయితే ఆశ్చర్యకరంగా టీమిండియా ఫాలో ఆన్ ఆడకుండా వెంటనే బ్యాటింగ్‌కు దిగింది. శుభ్‌మన్ గిల్ స్థానంలో చతేశ్వర్ పుజారా ఓపెనింగ్ చేస్తున్నాడు.
2023 టెస్టు చాంపియన్ షిప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కఠినమైన వికెట్లపై ఎలా ఆడాలనే విషయంలో ప్రాక్టీస్ కోసం ఈ ఇన్నింగ్స్‌ను టీమిండియా ఉపయోగించుకుంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 150 పరుగులు సాధించినా.. విజయం భారత్‌కు దక్కుతుంది.
Also Read: Kohli ODI Captaincy: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!
Also Read: Ganguly on Laxman: హైదరాబాద్‌ను వదిలేస్తున్న వీవీఎస్.. మా లక్ష్మణ్ బంగారం అంటున్న గంగూలీ!
Also Read: Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి