రాజస్థాన్ లో బీఎస్ఎఫ్ 57వ స్థాపనా దినోత్సవ్ లో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. 35,000 మందికి పైగా బీఎస్ఎఫ్, సీఏపీఎఫ్, పోలీసు బలగాలు దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేశారని అమిత్ అన్నారు. దేశం తరఫున అమరులకు కేంద్ర హోంశాఖ మంత్రి ఈ సందర్భంగా నివాళి అర్పించారు. బీఎస్ఎఫ్ బలగాలకు స్వయంగా మెడల్స్ ప్రదానం చేశారు.



జైసల్మేర్‌లో ఆదివారం జరుగుతున్న బీఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశానికి రక్షణ అంటే ముందుండేది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అని.. తొలి దశ దశలో రక్షణ ఇచ్చేది వారేనంటూ షా ప్రశంసించారు.







 సరిహద్దు రక్షణ అంటే దేశ రక్షణ అని తమ ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీని బీఎస్ఎఫ్ చేతికి అందించి సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేశామన్నారు.
Also Read: Nagaland Fire: నాగాలాండ్‌లో ఘోరం.. పౌరులపై భద్రతా సిబ్బంది కాల్పులు, 13 మంది మృతి






నాగాలాండ్ ఘటనపై అమిత్ షా ఆవేదన.. 
నాగాలాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు అని భావించి పౌరులపై సైన్యం కాల్పులు జరిపించింది. మోన్ జిల్లా ఓటింగ్‌లో బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాల్పుల ఘటనపై నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు చేస్తుందన్నారు. 






Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి