నాగాలాండ్ రాష్ట్రంలో భారీ తప్పిదం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు అనే అనుమానంతో భద్రతా సిబ్బంది సొంత పౌరులను కాల్చారు. ఈ ఘటనలో చాలా మంది ప్రజలు మరణించారు. దీంతో స్థానికులు ఆగ్రహించి.. కాల్పులకు కారణమైన భద్రత జవాన్ల వాహనాలను తగలబెట్టారు. నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లా ఓటింగ్‌లో ఈ ఘటన జరగ్గా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మిలిటెంట్లుగా భావించి పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు వెళ్తుండగా నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జరిగాయి. కార్మికులు తిరు గ్రామం నుంచి ఓ ట్రక్కులో తమ ఇళ్లకు వెళ్తున్నారు. అయితే, అంతకుముందే మిలిటెంట్ల కదలికలు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది.
ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు ట్రక్కుపై కాల్పులు జరిపాయి. అయితే, ట్రక్కులో లోపల ఉన్నది పౌరులే కావడం గమనార్హం. ఈ పరిణామంతో జిల్లాలోని ఓటింగ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ల వాహనాలకు నిప్పంటించి తగలబెట్టారు. సైన్యం పొరపాటు వల్లే ఘటన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. స్థానికంగా ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని రక్షణ అధికారులు వెల్లడించారు. మరోవైపు, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఈ ఘటనపై ఆర్మీ విచారణకు ఆదేశించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాగాలాండ్ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
పౌరులపై కాల్పులు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు విచారకరమని పేర్కొంది. భద్రతా సిబ్బంది పలువురికి తీవ్రంగా గాయాలైనట్టు తెలిపింది. ఇంకోవైపు ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని దురదృష్టంగా అభివర్ణించారు. దీనిపై సిట్‌తో విచారణ జరిపిస్తామని చెప్పారు.
Also Read: BSF Raising Day Live: బీఎస్ఎఫ్ రైజింగ్ డేలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా.. లైవ్ వీక్షించండి
Also Read: Divorce: మా ఆవిడ రోజుకు 6 సార్లు ఆ పని చేస్తోంది.. విడాకులిప్పించండి.. గోడు వెళ్లబోసుకున్న భర్త
Also Read: ఒమిక్రాన్ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి