దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ తగిన మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. అయినప్పటికీ ప్రజల్లో ఉన్న అపోహలు, సందేహాలు, అనుమానాలు, తరచుగా అడిగిన ప్రశ్నలపై కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానమిచ్చింది. మరి ఆ ప్రశ్నలు, సమాధానాలు మీరూ చూడండి.
ఒమిక్రాన్‌పై భారత్ ఎలా స్పందిస్తోంది?
దేశంలో కొవిడ్ 19 థర్డ్ వేవ్ వస్తుందా?
ఒమిక్రాన్ కేసులు దక్షిణాఫ్రికాలో వేగంగా పెరుగుతున్నట్లు ఆ దేశాధికారులు తెలిపారు. ఈ వేరియంట్ భారత్ సహా మరిన్ని దేశాలకు ఇంకా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వేరియంట్ తీవ్రత, కేసులు పెరిగేంత స్థాయిలో దీనికి వ్యాప్తి ఉందా అనే విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత లేదు.
భారత్‌లో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అందులోనూ డెల్టా వేరియంట్ భారత్‌లో తీవ్ర ప్రభావం చూపింది. దీని కారణంగానే ఒమిక్రాన్ ప్రభావం భారత్‌లో అంత ఎక్కువగా ఉండదని భావిస్తున్నాం. అయితే ఇందుకు శాస్త్రీయ ఆధారాలు కూడా కావాలి. అలా అని దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు. కొవిడ్ 19 నిబంధనలు పాటించాలి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ముందు నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నామో అలానే ఉండాలి. మాస్కు సరిగా వేసుకోవాలి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోకపోతే వెంటనే తీసుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. వెంటిలేషన్ సరిగా ఉన్న చోట ఉండేందుకు ప్రయత్నించాలి.
కొవిడ్ వేరియంట్లు ఎంత ప్రమాదకరమైనా కావొచ్చు.. కానీ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తాయని మాత్రం గుర్తుంచుకోవాలి. వ్యాక్సినేషన్ తీసుకోవాలి.
ఒమిక్రాన్‌పై ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయా?
ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌పై పనిచేయవని ఎక్కడా ఆధారాల్లేవు. అయితే కొత్త వేరియంట్లలో మ్యూటేషన్లు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గొచ్చు. వ్యాక్సిన్ రక్షణ అనేది యాంటీబాడీలు, రోగనిరోధకశక్తిపై ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా టీకాలు వైరస్ నుంచి రక్షణనిస్తాయి. కనుక ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లతో వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఒమిక్రాన్‌ను ఆందోళకర వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది.
ఈ కొత్త వేరియంట్‌పై ఆందోళన చెందాలా?
ఒమిక్రాన్‌ను ఆందోళకర వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించే ముందు దానిపై పరిశోధన చేస్తుంది. వ్యాప్తి ఎక్కువగా ఉన్నా, కొవిడ్ 19 ఎపిడెమియాలజీలో మార్పులు ఉన్నా, ప్రజారోగ్యంపై ప్రభావం చూపినా దాన్ని ఆందోళనకర వేరియంట్‌గా పరిగణిస్తారు. ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించారు అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే దక్షిణాఫ్రికా, బ్రెజిల్, జింబాబ్వే, చైనా, బోట్స్‌వానా, జీల్యాండ్, ఇజ్రాయెల్, మారిషస్, హాంకాంగ్, యూకే, సింగపూర్ దేశాలను ముప్పు దేశాలుగా డబ్ల్యూహెచ్ఓ పరిగణించింది.
Also Read: Cyclone Jawad: 'జవాద్' ధాటికి ఒడిశా, ఉత్తరాంధ్రలో హైఅలర్ట్.. రంగంలోకి భారత నేవీ
Also Read: Cyclone Jawad: తరుముకొస్తోన్న జవాద్ తుపాను.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌పై షాకింగ్ నిజాలు.. డెల్టా కంటే ఆ విషయంలో మూడు రెట్లు ఎక్కువట!
Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాల వేళ ఊరట.. దేశంలో 10 వేలకు దిగువనే కొత్త కేసులు
Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి