సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా నవంబర్‌ 18న నోటిఫికేషన్ జారీ చేసింది. 115 స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్‌ 23 నుంచి ప్రారంభమైంది. 

పోస్టు పేరు: స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌

కేటగిరీల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి:

జనరల్‌ కేటగిరి: 68 పోస్టులు 
EWS కేటగిరి: 8 పోస్టులు 
ఓబీసీ: 24 పోస్టులు 
ఎస్టీ: ౩ పోస్టులు 
ఎస్సీ: 12 పోస్టులు 

పోస్టులు వారీగా ఖాళీల వివరాలు:

ఎకనామిస్ట్‌/ ఏజీఎం- (స్కేల్‌-V)- 1 పోస్టు 
ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌/ ఏజీఎం- (స్కేల్‌-V)- 1 పోస్టు
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ఏజీఎం- (స్కేల్‌-V)- 1 పోస్టు
డాటా సైంటిస్ట్‌/ సీఎం- (స్కేల్‌-V)- 1 పోస్టు
క్రెడింట్ ఆఫీసర్‌/ఎస్‌ఎం- (స్కేల్‌ III)- 10 పోస్టులు
డాటా ఇంజినీరింగ్‌/ఎస్‌ఎం- (స్కేల్‌ III)- 11 పోస్టులు
ఐటీ సెక్యూరిటీ ఎనలిస్ట్‌/ఎస్‌ఎం- (స్కేల్‌ III)- 01 పోస్టు
ఐటీ ఎస్‌వోసీ ఎనలిస్ట్‌/ఎస్‌ఎం- (స్కేల్‌ III)- 02 పోస్టులు
రిస్క్‌ మేనేజర్/ఎస్‌ఎం- (స్కేల్‌ III)- 05 పోస్టు
టెక్నికల్‌ ఆఫీసర్‌(క్రెడిట్)/ఎస్‌ఎం- (స్కేల్‌ III)- 05 పోస్టు
ఫైనాల్సియల్‌ ఎనలిస్ట్‌/ మేనేజర్‌- (స్కేల్‌ II)- 20 పోస్టులు
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/ మేనేజర్- (స్కేల్‌II)- 15 పోస్టులు
లా ఆఫీసర్స్‌ /  మేనేజర్- (స్కేల్‌II)- 20 పోస్టులు
రిస్క్‌ మేనేజర్‌/ మేనేజర్- (స్కేల్‌II)- 10 పోస్టులు
సెక్యూరిటీ / మేనేజర్- (స్కేల్‌II)- 03పోస్టులు
సెక్యూరిటీ /ఏఎం- (స్కెల్‌I)- 09 పోస్టులు

పే స్కేల్‌ - రూల్స్ ప్రకారం చెల్లిస్తారు

విద్యార్హతలు:

ఎకనామిస్ట్‌- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌, బ్యాంకింగ్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌ పాలసీ, పబ్లిక్ పాలసీలో పీహెచ్‌డీ ఉండి ఐదేళ్లు వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉండాలి

ఇన్‌కం ట్యాక్‌ ఆఫీసర్- పదేళ్ల అనుభవం ఉన్న చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈ ఉద్యోగానికి అర్హులు. 

ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ- గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌లో ఫుల్‌ టైం మాస్టర్‌, బ్యాచిలర్‌ డిగ్రీ తీసుకొని పదేళ్లు ఇదే ఫీల్డ్‌లో అనుభవం ఉన్న వాళ్లు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. టాడా సైంటిస్ట్‌- స్టాటిస్టిక్స్‌, ఎకనామెట్రిక్స్, మాథ్‌మేటిక్స్‌, ఫైనాన్స్‌, ఎకనామిక్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌ లేదా బీఈ/ బీటెక్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీలో పీజీ ఉండి ఎనిమిది నుంచి పదేళ్లు అనుభవం ఉన్న వాళ్లంతా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

క్రెడిట్ ఆఫీసర్‌- మూడేళ్ల అనుభవం ఉన్న CA / CFA / ACMA OR MBA విద్యార్హత ఉన్న వాళ్లంతా దీనికి అప్లై చేసుకోవచ్చు.

డాటా ఇంజినీరింగ్‌- దీనికి సంబంధించిన ఫీల్డ్‌లో పీజీగానీ  లేదా డిప్లొమా గానీ ఉండి ఐదేళ్లు అనుభవం ఉన్న వాళ్లంతా ఈ ఉద్యోగానికి అర్హులు. 
ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్‌- సంబంధిత ఫీల్డ్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉండి ఆరేళ్లు అనుభవం ఉన్న వాళ్లంతా అప్లై చేసుకోవచ్చు. 

ఐటీ ఎస్‌వోసీ అనలిస్ట్‌- ఈ ఉద్యోగానికి కూడా సంబంధిత ఫీల్డ్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉండి ఆరేళ్లు అనుభవం ఉన్న వాళ్లంతా అప్లై చేసుకోవచ్చు. 

రిస్క్‌ మేనేజర్‌ - ఎంబీఏ ఫైనాన్స్‌ లేదా దీనికి ఈక్వల్‌గా ఉండే డిగ్రీ చేసి మూడేళ్లు అనుభవం ఉన్న వాళ్లంతా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

టెక్నికల్ ఆఫీసర్‌(క్రెడిట్‌)- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / కాలేజీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉన్న వాళ్లు ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హులు.

ఫైనాన్షియల్ అనలిస్ట్- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / కాలేజీ నుంచి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)చివరి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 3 ఏళ్ల పని అనుభవం అనుభవం ఉన్న వాళ్లు ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హులు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / కాలేజీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. కనీసం 2 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న అభ్యర్థులు అర్హులు.

లా ఆఫీసర్- అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా (LLB)కలిగి ఉండాలి. కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. 

రిస్క్ మేనేజర్- అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / కళాశాల నుంచి MBA/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉన్న వాళ్లంతా ఈ పోస్టుకు అర్హులు.

సెక్యూరిటీ/మేనేజర్ – అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. కనీసం 5 సంవత్సరాల పని అనుభవంతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 

సెక్యూరిటీ/ ఏఎం- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / కళాశాల నుంచి గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. కనీసం 5 ఏళ్ల పని అనుభవంతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SO కోసం ఎలా దరఖాస్తు చేయాలి :
అభ్యర్థులు ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 డిసెంబర్ 17లోపు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు అవసరమైనవి-: ఫోటోగ్రాఫ్, సంతకం స్కాన్ చేసి పెట్టుకోవాలి. 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SO ఎంపిక విధానం : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SOఎంపిక ప్రక్రియ 2 దశల్లో ఉంటుంది. 

  1. 1. ఆన్‌లైన్ పరీక్ష
  2. 2. వ్యక్తిగత ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు 

ప్రారంభ తేదీ: 23నవంబర్‌ 2021
అఖరు తేదీ: 17 డిసెంబర్‌ 2021
ఫీజు చెల్లించేందుకు ఆఖరు తేదీ: 17 డిసెంబర్‌ 2021
అడ్మిట్ కార్డులు ఇచ్చే తేదీ: 11 జనవరి 2022
పరీక్ష తేదీ: 22 జనవరి 2022

అప్లికేషన్ ఫీజు:

SC/ST అభ్యర్థులు: రూ. 175
మిగతా అభ్యర్థులు:   రూ.180
అభ్యర్థులు తమ ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్, ఈ చలానా ద్వారా చెల్లించవచ్చు. 

ముఖ్యమైన లింక్స్‌

ఆన్‌లైన్‌లో అప్లై చేయండి రిజిస్ట్రేషన్, లాగిన్, డౌన్‌లోడ్ యాప్
డౌన్‌లోడ్‌ నోటిఫికేషన్‌  ఇక్కడ క్లిక్ చేయండి

జాబ్‌ లొకేషన్: ఇండియాలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. 
వయోపరిమితి: 2021 సెప్టెంబర్‌ 30 నాటికి కనీస వయసు 20 ఏళ్లు, గరిష్ట వయసు 45 ఏళ్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. 

Also Read: డీఆర్డీవోలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి

Also Read: NTPC Recruitment 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. జాబ్ కొడితే రూ.60 వేల జీతం.. ఇంకా రెండు రోజులే ఉంది

Also Read: Indian Navy Jobs 2021: నేవీ షిప్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డులో ఉద్యోగాలు.. అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే

Also Read: Job Loss: ఉద్యోగం కోల్పోయారా? పే కట్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి