Omicron Fear: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇటీవల భారత్‌లో ప్రవేశించింది. కొన్ని రోజుల కిందట రెండు ఒమిక్రాన్ కరోనా కేసులు కర్ణాటకలోని బెంగళూరులో నమోదు కాగా, తాజాగా మరో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఒమిక్రాన్ వేరియంట్ సామాన్యులనే కాదు వైద్య సిబ్బందిని సైతం భయాందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్ భయాల  నేపథ్యంలో ఓ డాక్టర్ చేసిన పని ఒళ్లుగగుర్పొడిచేలా చేస్తోంది. భార్యను, పిల్లలను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జరిగింది.


హత్య చేసిన తరువాత డాక్టర్ పంపిన మెస్సేజ్, ఎందుకు హత్య చేశాడో రాసిన లేఖ యూపీలో వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కు చెందిన సుశీల్‌కుమార్‌ ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాధిపతిగా  పనిచేస్తున్నారు. ఆయనకు భార్య చంద్రప్రభ (48), 18 ఏళ్ల కుమారుడు శిఖర్‌ సింగ్‌, 15 ఏళ్ల కుమార్తె ఖుషీ సింగ్‌ ఉన్నారు. ఈ కుటుంబం కల్యాణ్‌పూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. అయితే గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసుల గురించి తెలుసుకుని ఆందోళనకు గురయ్యాడు. అసలే డిప్రెషన్‌లో ఉన్న ఫోరెన్సిక్ డాక్టర్ సుశీల్ కుమార్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
Also Read: Crime News: ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఇంటికి వెళ్లి చూస్తే షాక్.. దారుణమైన స్థితిలో తల్లీ కూతుళ్లు..! అసలేం జరిగిందంటే..?


కరోనా మహమ్మారి నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవడమో.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారమో తమకు తోచింది చేస్తుంటారు. ఈ డాక్టర్ మాత్రం దారుణంగా ఆలోచించారు. కుటుంబాన్ని కరోనా బారి నుంచి, ఒమిక్రాన్ సవాళ్ల నుంచి కాపాడుకోవడానికి మార్గమంటూ వారిని హత్య చేయాలని డాక్టర్ ప్లాన్ చేశారు. సుత్తితో భార్యను, కుమారుడు, కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేసి.. ఈ విషయాన్ని తన సోదరుడు సుశీల్‌కు ఫోన్ ద్వారా మెస్సేజ్ పంపాడు. పోలీసులకు సుశీల్ ఈ విషయాన్ని చెప్పగా.. వారు వెళ్లేసరికి అపార్ట్‌మెంట్ లాక్ చేసి ఉంది. తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లి చూడా డాక్టర్ భార్య చంద్రప్రభ, శిఖర్ సింగ్, ఖుషీ సింగ్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. అక్కడ సుశీల్ కుమార్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒమిక్రాన్ భయంతో కుటుంబాన్ని హత్య చేశాడని తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు.


కేసు నమోదు చేసుకున్న కాన్పూర్ పోలీసులు గత రెండు రోజులుగా నిందితుడు సుశీల్ కుమార్ కోసం గాలిస్తున్నారు. కుటుంబాన్ని హత్య చేసిన అనంతరం ఎక్కడైనా పారిపోయి సుశీల్ సైతం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. గంగా నది తీర ప్రాంతాల్లో డెడ్ బాడీ కనిపిస్తే సమాచారం అందించాలని సమీపంలోని పీఎస్‌లకు సూచించినట్లు కాన్పూర్ అడిషనల్ డీసీపీ మీడియాకు తెలిపారు. నిందితుడు గత కొంతకాలం నుంచి మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడని, ఈ క్రమంలో ఒమిక్రాన్ సాకుతో కుటుంబాన్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: East Godavari Crime: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి రవాణా... పోలీసులకు ఎలా చిక్కారంటే..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి