న్యూజిలాండ్ చెందిన స్పిన్నర్ అజాజ్ పటేల్ భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 1956లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్, 1999లో భారత బౌలర్ అనిల్ కుంబ్లే తర్వాత క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన మూడో బౌలర్‌గా అజాజ్ పటేల్ నిలిచాడు. అయితే ఈ రికార్డు సాధించిన ముగ్గురూ స్పిన్ బౌలర్లే కావడం విశేషం. స్పిన్నర్లు మాత్రమే ఈ రికార్డు సాధించడానికి కారణం ఏంటి? వారికి అడ్వాంటేజ్‌గా ఏం మారాయి?
ఫాస్ట్ బౌలర్లు ఒక్క ఓవర్ బౌలింగ్ చేయాలంటే ఎంతో శారీరక శ్రమ అవసరం. వారి రనప్ ఎక్కువ ఉంటుంది. బంతిని వేగంగా విసిరేందుకు ఎక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో స్పిన్నర్ల కంటే పేస్ బౌలర్లు తొందరగా అలిసిపోతారు. ఒకే స్పెల్‌లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయలేరు.
స్పిన్నర్లు మాత్రం అలా కాదు. వారి రనప్ చాలా తక్కువగా ఉంటుంది. బంతిని విసరడానికి ఎక్కువ బలం కూడా అవసరం లేదు. కాబట్టి వారు సుదీర్ఘమైన స్పెల్‌లు కూడా వేయగలరు. ఎప్పుడైనా స్లో ఓవర్ రేట్ సమస్య ఎదురైనప్పుడు కెప్టెన్లు స్పిన్నర్ల వైపే చూస్తూ ఉంటారు.
ఎక్కువ బంతులు వేసినప్పుడు వారికే ఎక్కువ వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. తమ బౌలింగ్‌కు పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయంపై అవగాహన వస్తుంది. బంతుల్లో వైవిధ్యం చూపిస్తే బ్యాట్స్‌మెన్ బోల్తా కొట్టేందుకు కచ్చితంగా అవకాశం ఉంటుంది. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ తీయగా.. అజాజ్ పటేల్ మొదటి ఇన్నింగ్స్‌లోనే సాధించాడు.
ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 109.5 ఓవర్లు ఆడితే అందులో 47.5 ఓవర్లు అజాజ్ పటేల్ వేశాడు. అంటే మొత్తం ఇన్నింగ్స్‌లో 40 శాతానికి పైగా ఓవర్లు అజాజ్ పటేల్ తోనే బౌల్ చేయించారన్న మాట. 1956లో జిమ్ లేకర్ 10 వికెట్లు తీసిన ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మొత్తం 150.2 ఓవర్లు ఆడితే అందులో 51.2 ఓవర్లు జిమ్ లేకరే వేశాడు.
ఇక 1999లో అనిల్ కుంబ్లే 10 వికెట్లు తీసినప్పుడు పాకిస్తాన్ మొత్తం 60.3 ఓవర్లు ఆడింది. అందులో 26.3 ఓవర్లు కుంబ్లేనే వేశాడు. కుంబ్లే తర్వాత అత్యధికంగా 18 ఓవర్లు వేసిన హర్భజన్ కూడా స్పిన్నరే. కాబట్టి ఈ విషయంలో పేసర్ల కంటే స్పిన్నర్ల కంటే ఎక్కువ అవకాశం ఉందన్న మాట.
Also Read: Ganguly on Laxman: హైదరాబాద్‌ను వదిలేస్తున్న వీవీఎస్.. మా లక్ష్మణ్ బంగారం అంటున్న గంగూలీ!
Also Read: Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి