రాయలసీమ వరదల్లో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్  విషయంలో మానవ తప్పిదం ఉందంటూ వస్తున్న విమర్శలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించండంతో ఏపీలో విపక్షాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించాయి. ప్రభుత్వం జవాబుదారీ తనం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి 62 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయిందని.. తక్షణం విచారణ జరిపించాలని విపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. 


Also Read : ఉత్తరాంధ్రపై అధికారుల స్పెషల్ ఫోకస్.. ప్రాణ నష్టం ఉండకూడదన్న సీఎం జగన్


తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరదల విషయంలో ఏం చేయాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థ ఏర్పాటు దాన్ని ఉపయోగించుకోలేకపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో గేట్లన్నీ మొత్తం కొట్టుకుపోయాయి. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62మంది చనిపోయారు. వరదలతో రూ.6వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టమని కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ గేట్లకు గ్రీజు పూయలేని వారు మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు.  తెలిసో.. తెలియకో.. ఓట్లు వేస్తే ప్రజల ప్రాణాలు బలిగొనే హక్కు లేదన్నారు. నిర్లక్ష్యంపై న్యాయ విచారణ అడిగితే ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నించారు. 


Also Read: వీఆర్వోలను తరిమికొట్టండి...మంత్రి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు... మంత్రిని బర్తరఫ్ చేయాలని వీఆర్వోలు డిమాండ్


సీఎం జగన్‌ బాధ్యతలకు అతీతుడు కాదని.. బాధ్యతలకు వెనకాడితే సీఎంగా ఉండే అర్హత జగన్‌కు లేదని తేల్చారు. వర్షాలు భారీగా పడి రెండుసార్లు వరదలొచ్చాయి. ప్రాజెక్టులన్నీ అప్పటికే పూర్తిగా నిండిపోయాయి. మళ్లీ వరద వస్తుందని వాతావరణశాఖ ముందే హెచ్చరించింది. అయినా స్పందించకపోవడం వల్లే విపత్తు జరిగింది. విపత్తుకు బాధ్యులైన వారందరినీ శిక్షించాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 


Also Read:  " అన్నమయ్య డ్యాం ప్రమాదంపై అంతర్జాతీయంగా అధ్యయనం జరిగితే పరువు పోతుంది.." రాజ్యసభలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు


ఏపీలో వరదల, వరద నష్టం విషయంలో కేంద్రం రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదని హితవు పలికారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జలప్రళయాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రషింగ్ షెకావత్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుని తప్పుబడుతూ మంత్రి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. కేంద్ర మంత్రి ఏం జరిగిందన్న విషయంపై జిల్లా కలెక్టర్‌ తో కానీ,  ప్రాజెక్టు అధికారులతో కానీ సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా నిరాధారమైన ప్రకటనలు చేయడం సరికాదన్నారు.  షెకావత్ వ్యాఖ్యలపై టీడీపీ చేస్తున్న యాగీ చూస్తుంటే జల ప్రళయంలో కూడా ఇంత దిగజారి రాజకీయం చేస్తారా? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు అనిల్. 


Also Read: వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన... బాధితులకు అండగా ఉంటామని హామీ... తక్షణ సాయం రూ.189 కోట్లు ముంజూరు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి