ఒమిక్రాన్ కేసులు దేశంలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ చాప కింద నీరులా వైరస్ వ్యాప్తి ఉంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే కీలక వ్యాఖ్యలు. ఒమ్రికాన్ వ్యాప్తి అధికంగా ఉందని కాదని దాని లక్షణాలు మాత్రం స్వల్పంగా ఉన్నాయన్నారు.
మహారాష్ట్రలో శనివారం 33 ఏళ్ల వ్యక్తికి ఒమ్రికాన్ వేరియంట్ నిర్ధరణైంది. ఆ తర్వత రాజేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బాధితుడు దక్షిణాఫ్రికా నుంచి వయా దుబాయ్ మహారాష్ట్ర వచ్చాడు.
కంగారొద్దు..
మహారాష్ట్రలో ఒమ్రికాన్ కేసు నమోదుకావడంపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ఈ వేరియంట్‌పై మరింత సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓ త్వరలోనే చెబుతుందన్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన మార్గదర్శకాలను విడుదల చేస్తుందన్నారు. ప్రజలు వాటిని అనుసరించాలన్నారు.
దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు నమోదైంది. టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమ్రికాన్ నిర్ధారణైంది. దీంతో దేశంలో ఒమ్రికాన్ కేసులు ఐదుకు చేరాయి.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు
Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు