ABP  WhatsApp

Nagaland firing incident Update: నాగాలాండ్‌లో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోండి: కేంద్ర హోంశాఖను కోరిన సీఎం

ABP Desam Updated at: 06 Dec 2021 01:59 PM (IST)
Edited By: Murali Krishna

నాగాలాండ్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

నాగాలాండ్‌లో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిని సీఎం

NEXT PREV

నాగాలాండ్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల (ఏఎఫ్ఎస్‌పీఏ) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీఫియు రియో.. కేంద్రాన్ని కోరారు. ఈ చట్టం వల్ల దేశ ఖ్యాతి మంటగలుస్తుందన్నారు.







నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రితో నేను మాట్లాడాను. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ఇస్తున్నాం. ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని నాగాలాండ్‌ నుంచి వెనక్కి తీసుకోవాలని మేం కోరుతున్నాం. ఈ చట్టం కారణంగా భారత ఖ్యాతి మసకబారుతోంది.                                                     - నీఫియు రియో, నాగాలాండ్ సీఎం 


రూ.16 లక్షలు..


నాగాలాండ్‌ బలగాల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మృతుల కుటంబాలకు రూ.11 లక్షల చొప్పున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాగాలాండ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇవ్వనుంది. ఈ మేరకు నాగాలాండ్ సీఎం నీఫియు రియో ప్రకటించారు.


ఏం జరిగింది?


నాగాలాండ్ మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద మిలిటెంట్ల కదలికలున్నట్లు బలగాలకు ఆదివారం సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. అయితే అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తుండగా బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.


Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన


Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at: 06 Dec 2021 01:57 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.