జీవిత బీమా మార్కెట్లో భారతీయ జీవిత బీమా సంస్థ (LIC)కి తిరుగులేదు. ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలను కస్టమర్లకు అందిస్తోంది. ఈ మధ్య కాలంలో కంపెనీ అందిస్తోన్న సరికొత్త 'జీవన్‌ ఆనంద్‌' పాలసీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరణానంతర ప్రయోజనాలు అందించడమే కాకుండా మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ రాబడి పొందేందుకు వీలుంది.


ఎల్‌ఐసీ సరికొత్త జీవన్‌ ఆనంద్‌ పాలసీ నాన్‌ లింక్‌డ్‌, జీవిత బీమా ప్రణాళిక. స్టాక్‌ మార్కెట్‌తో సంబంధం లేదు. ఈ పాలసీ తీసుకొనేందుకు



  • కనిష్ఠ వయసు 18 ఏళ్లు.

  • గరిష్ఠ వయసు 50 ఏళ్లు.

  • గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 ఏళ్లు.

  • కనిష్ఠ పాలసీ సమయం 15 ఏళ్లు

  • గరిష్ఠ పాలసీ సమయం 35 ఏళ్లు.

  • ప్రీమియాన్ని ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెలకు కట్టుకోవచ్చు.


ఎల్‌ఐసీ జీవన్‌ ఆనంద్‌ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ బీమా మొత్తం రూ.లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. ఎంతైనా చేసుకోవచ్చు. రెండేళ్ల పాటు ప్రీమియం కట్టిన తర్వాత పాలసీని సరెండర్‌ చేసుకొనే అవకాశం ఉంది. అప్పటి గరిష్ఠ సరెండర్‌ విలువను బట్టి డబ్బు వస్తుంది. అంతేకాకుండా రుణ సదుపాయం కూడా అందిస్తున్నారు. సరెండర్‌ విలువ 90 శాతం వరకు రుణం అందిస్తారు.


దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే నామినీకి బీమా మొత్తంపై 125 శాతం డబ్బు లేదా ఏడు రెట్లు వార్షిక ప్రీమియం అందిస్తారు. పాలసీ గడువు ముగిసిన తర్వాత మరణిస్తే నామినీకి బీమా మొత్తం, ఇతర ప్రయోజనాలూ దక్కుతాయి.


మెచ్యూరిటీ సమయంలో పాలసీదారుడికి బీమా మొత్తంతో పాటు రివర్షనరీ బోనసులు, తుది అదనపు బోనస్‌ లభిస్తుంది. ఉదాహరణకు 24 ఏళ్ల వయసులో 21 ఏళ్ల గడువుతో రూ.5 లక్షల మొత్తానికి జీవన్‌ ఆనంద్‌ పాలసీ తీసుకుంటే ఏటా రూ.26,815 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.73.50 అన్నమాట. మొత్తంగా 21 ఏళ్లకు మీరు రూ.5.63 లక్షలు పెట్టుబడి పెడతారు. మెచ్యూరిటీ సమయంలో బోనస్‌లతో కలిపి రూ.10.33 లక్షలు లభిస్తాయి.


Also Read: India Post Payment Bank: లిమిట్‌ దాటి డబ్బు జమ చేసినా.. తీసినా.. పోస్టాఫీసులో రుసుము తప్పదు!


Also Read: Stock Market Update: ఈ 100 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ 10-122% పెరిగాయి తెలుసా!


Also Read: SBI vs HDFC vs ICICI Interest Rates: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలో ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ ఎవరిస్తున్నారో తెలుసా?


Also Read: Rapido: ర్యాపిడోకు తెలంగాణ హైకోర్టు షాక్! ఆ ప్రకటన తక్షణమే నిలిపేయాలని ఆదేశం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి