భారత స్టాక్ మార్కెట్లు నవంబర్ నెలలో తీవ్రంగా ఒడుదొడుకులకు లోనయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్‌పై ఆందోళన రేకెత్తడం, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీరేట్లపై ముందే నిర్ణయం తీసుకుంటామని యూఎస్ ఫెడ్ సూచనలు చేయడం వంటివి మార్కెట్లను నష్టాల్లో ముంచెత్తాయి. అయితే మెరుగైన జీడీపీ గణాంకాలు, తయారీ రంగం పురోగతి, జీఎస్‌టీ రాబడి పెరగడంతో కొన్నిసార్లు సూచీలు గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లాయి.
మొత్తంగా నవంబర్లో మార్కెట్లు 4 శాతం వరకు పతనమైనా 100 స్మాల్‌క్యాప్ స్టాక్స్ మాత్రం 10-122 శాతం ర్యాలీ చేశాయి. ఇక బీఎస్‌ఈ మెటల్, బ్యాంక్‌ఎక్స్ సూచీలు దాదాపు 9 శాతం నష్టపోయాయి. ఇక రియాలిటీ, ఆటో, ఎనర్జీ సూచీలు 4-5 శాతం వరకు పతనం అయ్యాయి. బీఎస్‌ఈ టెలికాం సూచీ 6 శాతం, ఐటీ, పవర్ సూచీలు 2-3 శాతం పెరిగాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం ఫ్లాట్‌గా ముగిశాయి.
నవంబర్లో ఆరమ్ ప్రాప్‌టెక్, టాటా టెలీ సర్వీసెస్, బ్రైట్‌కామ్ గ్రూప్, జీఎర్‌ఎం ఓవర్‌సీస్, కేపీఐటీ టెక్నాలజీస్, జేబీఎం ఆటో, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్, జిందాల్ వరల్డ్‌వైడ్, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్, మీర్జా ఇంటర్నేషనల్, ఆర్ సిస్టమ్ ఇంటర్నేషనల్, మాంటె కార్లో ఫ్యాషన్స్ వంటివి 40 నుంచి 122 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో గాయత్రీ ప్రాజెక్ట్స్, వికాస్ డబ్ల్యూఎస్‌పీ, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గోదావరీ పవర్, గ్రాఫైట్ ఇండియా, వలియంట్ ఆర్గానిక్స్, స్పందనా స్ఫూర్తీ ఫైనాన్షియల్, మనప్పురం ఫైనాన్స్, జీఎన్‌ఏ ఆక్సెల్స్, బజాజ్ కన్జూమర్ కేర్, సీక్వెంట్ సైంటిఫిక్, స్పెన్సర్ రిటైల్ వంటి 200 స్మాల్‌క్యాప్ స్టాక్స్ 10-28 శాతం వరకు నష్టపోయాయి.
Also Read: ATM Transaction Charges: కస్టమర్లకు బ్యాంకుల షాక్..! ఏటీఎం లావాదేవీల ఫీజు పెంపు
Also Read: HDFC FD Interest Rates: ఎఫ్‌డీ చేస్తున్నారా..? హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్లు పెంచింది మరి
Also Read: Audi Q7: ఆడీ కొత్త కారు వచ్చేస్తుంది.. మరింత ఆకర్షణీయంగా!
Also Read: India Post Payment Bank: లిమిట్ దాటి డబ్బు జమ చేసినా.. తీసినా.. పోస్టాఫీసులో రుసుము తప్పదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి