బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేద్దాం అనుకుంటున్నారా? అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మంచి వడ్డీరేట్లను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు ఈ మధ్యే వడ్డీరేట్లను సవరించింది. ఈ మార్పుతో కస్టమర్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మరింత ఎక్కువ వడ్డీని పొందొచ్చు. 2021, డిసెంబర్‌ 1 నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి.


హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 2.50 నుంచి 5.50 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఇక సీనియర్‌ సిటిజన్లు అయితే 3 నుంచి 6.25 శాతం వరకు ప్రయోజనం పొందొచ్చు. ఈ బ్యాంకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీలు చేసుకోవచ్చు.


ఎన్ని రోజులకు ఎంత వడ్డీ వస్తుందంటే..!



  • 7  నుంచి 29 రోజులకు 2.50 శాతం

  • 30 నుంచి 90 రోజులకు 3 శాతం

  • 91 రోజుల నుంచి 3 నెలలకు 3.5 శాతం

  • 6 నెలల 1 రోజు నుంచి ఏడాదిల లోపు 4.4 శాతం

  • ఏడాది ఎఫ్‌డీకి  4.9 శాతం

  • ఏడాది 1 రోజు నుంచి రెండేళ్లకు 5 శాతం

  • రెండేళ్ల 1 రోజు నుంచి మూడేళ్లకు 5.15 శాతం

  • మూడేళ్ల 1 రోజు నుంచి ఐదేళ్లకు 5.35 శాతం

  • ఐదేళ్ల 1 రోజు నుంచి పదేళ్లకు 5.50 శాతం


Also Read: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?


Also Read: బిగ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టేందుకు అశ్విన్‌ రెడీ..! ఏంటో తెలుసా?


Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!


Also Read: శ్రేయస్‌నూ కరుణ్‌ నాయర్‌లా తప్పిస్తారా? సీనియర్ల కోసం త్యాగం తప్పదా?


Also Read: రెండో టెస్టు నుంచి రహానే, జడేజా, ఇషాంత్ శర్మ ఔట్.. బీసీసీఐ ప్రకటన


Also Read: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్‌ తాజా కోటీశ్వరులు వీరే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి