Gold Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త. భారత మార్కెట్లో బంగారం ధర వరుసగా నాలుగోరోజు స్వల్పంగా దిగొచ్చింది. తాజాగా 22 క్యారెట్లపై రూ.150 మేర తగ్గడంతో 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,450 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత)పై రూ. 160 మేర తగ్గడంతో ధర రూ.48,490 కి పతనమైంది. ఇక వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో మూడు రోజుల తరువాత తగ్గింది. రూ.300 మేర పుంజుకోవడంతో తాజాగా కిలో రూ.65,300కి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు ఉంటున్నాయి.
ఇక విజయవాడలోనూ పసిడి ధర స్వల్పంగాపెరిగి. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారంపై రూ.150 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర నేడు రూ.44,450 అయింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,490గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,850 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,840కి దిగిరాగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,600 అయింది. చెన్నై నగరంలో ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల ఆభరణాలపై రూ.70 మేర పెరగడంతో బంగారం ధర రూ.44,730 అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,800గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రూ.130 మేర బంగారం ధర దిగిరావడంతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,450కి పడిపోయింది.
Also Read: SBI ATM Withdrawal Rule: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్ తెలుసా?
తగ్గిన ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు దిగొచ్చింది. గత రెండు వారాలుగా దాదాపు ప్రతిరోజూ ప్లాటినం ధర తగ్గుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,640 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలలో ప్లాటినం ఇదే ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Fixed Deposits Rate: త్వరపడండి..! ఈ గవర్నమెంట్ కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.77% వడ్డీ ఇస్తోంది