ఆడీ కంపెనీ లాంచ్ చేసిన కార్లలో క్యూ7 అత్యంత పాపులర్ మోడల్ అనడంతో ఎటువంటి సందేహం లేదు. ఈ జర్మన్ కార్ల బ్రాండ్ మనదేశంలో ఇంత పాపులర్ అవ్వడానికి ఉన్న కారణాల్లో క్యూ7 మోడల్ కూడా ఒకటి. ఇప్పుడు క్యూ7 కొత్త మోడల్ కూడా మనదేశంలో కూడా లాంచ్ అవుతోంది. వచ్చే సంవత్సరం ఈ మోడల్ మనదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది.


మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌తో ఈ క్యూ7 లాంచ్ కానుంది. టఫ్ ఎస్‌యూవీ లుక్ ఇందులో ఉంది. కొత్త కలర్ ఆప్షన్లు కూడా ఇందులో చూడవచ్చు. ఇందులో కొత్త బాడీ క్లాడింగ్, రివైజ్డ్ బంపర్ సెటప్, పెద్ద చక్రాలు కూడా ఉన్నాయి. దీని ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ట్విన్ స్క్రీన్ సెంటర్ కన్సోల్‌ను ఇందులో అందించారు. ఆడీ ఏ8లో కూడా ఇదే ఫీచర్ అందుబాటులో ఉంది.


ఈ కారు డిజైన్ మొత్తం మారిపోయింది. చూడటానికి మరింత లగ్జరీగా ఉంది. ఇందులో రెండు టచ్ స్క్రీన్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లసర్, కొత్త క్రోమ్/అల్యూమినియం హైలెట్స్ ఉన్నాయి. దీంతోపాటు ప్రీమియం ఆడియో సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్, 4-జోన్ క్లైమెట్ కంట్రోల్ కూడా ఇందులో అందించారు. హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది.


అన్ని కొత్త ఆడీ కార్లలాగానే కూ7లో కూడా కేవలం పెట్రోల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇందులో ఉన్న వీ6 యూనిట్ కొంచెం ఎలక్ట్రికల్ అసిస్టెన్స్ కూడా అందించనుంది. ఇది కారు సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. కొత్త క్యూ7లో ఎస్‌యూవీ రేంజ్ కూడా పెరగనుంది.


ప్రస్తుతం ఆడీలో క్యూ5 నుంచి క్యూ8 వరకు కార్లు ఉన్నాయి. ఆడీ కొత్త కార్లను లాంచ్ చేయడాన్ని వేగవంతం చేసింది. క్యూ5 ఇటీవలే లాంచ్ అయింది. అలాగే త్వరలో రానున్న క్యూ7, క్యూ3 కార్లతో తన రేంజ్‌ను ఆడీ మరింత పెంచుకోనుంది.


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి