పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. భాజపాతో పాటు దింద్సా పార్టీతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు చండీగఢ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అమరీందర్ సింగ్ ప్రకటించారు.
భాజపా సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో నవజోత్ సింగ్ సిద్ధూతో ఏర్పడిన విబేధాల కారణంగా అమరీందర్ సింగ్.. అక్టోబర్‌లో పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.
ముగ్గురితో బరిలో..
అమరీందర్ సింగ్ పార్టీతో పాటు సిరోమణి అకాలీ దళ్ మాజీ నేత సుఖ్‌దేవ్ సింగ్ దింద్సా ఏర్పాటు చేసిన పార్టీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమిత్ షా ఇటీవల ప్రకటించారు. ఈ కూటమితో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు.
పంజాబ్ ఎన్నికలు..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈసారి కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ, అమరీందర్ సింగ్ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆమ్‌ఆద్మీ పార్టీ 20 స్థానాలు గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. సిరోమణి అకాలీ దళ్ 15 సీట్లు గెలవగా, భాజపా మూడు స్థానాల్లో విజయం సాధించింది.
Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన
Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?