అన్వేషించండి

PM Modi: మీ అందరికీ ఓ గుడ్ న్యూస్, ఆ చీతాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయ్ - ప్రధాని మోదీ ట్వీట్

PM Modi: నమీబియా నుంచి వచ్చిన 8 చీతాల్లో 2 చీతాలను ఎన్‌క్లోజర్‌లోకి వదులుతున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు.

PM Modi on Cheetahs:

2 చీతాలు ఎన్‌క్లోజర్‌లోకి..

నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అధికారులు. అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా దాదాపు 50 రోజులుగా క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పుడిప్పుడే అవి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్న క్రమంలో ఓ పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి రెండు చీతాలను వదిలారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. రెండు చీతాలను ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేస్తున్న వీడియోని పోస్ట్ చేశారు. "అందరికీ ఆనందం కలిగించే వార్త ఇది. నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలు దాదాపు 50 రోజులుగా  క్వారంటైన్‌లో  ఉన్నాయి. అక్కడి హ్యాబిటాట్‌కు అలవాటు పడే విధంగా ఇప్పుడు ఎన్‌క్లోజర్‌లోకి పంపుతున్నారు" అని ట్వీట్ చేశారు. అన్ని చిరుతలు ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. మిగతా చీతాలను త్వరలోనే 
ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేస్తామని వెల్లడించారు. మిగతా 6 చీతాలను ఈ నెల 10 వ తేదీన అధికారుల సూచనల మేరకు ఎన్‌క్లోజర్‌లోకి పంపుతారని తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం చీతా టాస్క్ ఫోర్స్‌ని (Cheetah Task Force) కూడా నియమించింది. ఈ 8 చీతాల సంరక్షణ బాధ్యతలను అప్పగించింది. క్వారంటైన్ నుంచి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన చీతాల పేర్లు ఎడ్డీ, ఫ్రెల్టాన్‌గా అధికారులు తెలిపారు. 

టాస్క్‌ఫోర్స్..

నమీబియా నుంచి వచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో సంరక్షిస్తున్నారు. వీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలే చేపడుతోంది కేంద్రం. ప్రస్తుతం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఓ టాస్క్‌ఫోర్స్‌ని నియమించింది. చీతాలను సరైన విధంగా సంరక్షించుకునే బాధ్యతల్ని...ఈ టాస్క్‌ఫోర్స్ తీసుకోనుంది. చీతాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం, క్వారంటైన్‌లో ఎలా ఉంటున్నాయో పరిశీలించడం, చీతాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించటం లాంటివి చేయనున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయటమే కాదు. చీతాల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతోంది కేంద్రం. వేటగాళ్ల నుంచి వీటికి రక్షణ కల్పించేందుకు... ప్రత్యేక శిక్షణ తీసుకున్న జర్మన్ షెపర్డ్స్‌ కుక్కల్ని కాపలాగా ఉంచనున్నారు. ప్రస్తుతం వీటికి ఇండో టిబెటన్ బార్డర్ వద్ద స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కునో నేషనల్ పార్క్‌లో...చీతాలున్న చోట ఇవి కాపలా కాస్తాయి. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. 
పులి చర్మం, ఎముకలతో పాటు ఏనుగు తొండాన్నీ గుర్తించే విధంగా వాటికి శిక్షణ ఇస్తున్నారు. WWWF-India (World Wide Fund for Nature India) ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ కొనసాగుతోంది. ITBPలోని బేసిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ శునకాలను ట్రైన్ చేస్తున్నారు. దాదాపు 7 నెలల శిక్షణ తరవాత ఇవి కాపలాకు సిద్ధమవుతాయి. పసిగట్టడం, ట్రాక్ చేయటం లాంటి నైపుణ్యాల్లో అవి ఆరితేరాకే క్షేత్రస్థాయిలోకి పంపుతారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీటి డ్యూటీ మొదలవుతుంది. దాదాపు 7 దశాబ్దాల తరవాత చీతాలు భారత్‌కు తిరిగి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వాటిని అధికారికంగా వదిలారు.

Also Read: Gujarat Election 2022: మీరు చెప్పండి మేం వింటాం, గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ కొత్త స్ట్రాటెజీ

 

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG Historic Lords Test: లార్డ్స్ హిస్టారికల్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!
హిస్టారికల్ లార్డ్స్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!
ABP Desam Top 10, 9 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 9 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News: తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
తెలంగాణలో డోర్స్ ఓపెన్ చేయండి! బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం!
Yograj VS Kapil Dev Controversy: యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget