Burnt Hair Perfume: సేల్స్‌మెన్‌లా మారిపోయిన మస్క్- ప్లీజ్ కొనండి అంటూ ట్వీట్!
Burnt Hair Perfume: పెర్‌ఫ్యూమ్ అమ్మకాల కోసం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. సేల్స్‌మెన్ అవతారం ఎత్తారు.
Burnt Hair Perfume: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇటీవల తాను కొత్తగా లాంచ్ చేసిన 'బర్ట్న్ హెయిర్' పెర్‌ఫ్యూమ్ కోసం మస్క్.. సేల్స్‌మెన్ అవతారం ఎత్తారు. ఈ పెర్‌ఫ్యూమ్‌ను ప్రమోట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
Please buy my perfume, so I can buy Twitter
— Elon Musk (@elonmusk) October 12, 2022
మస్క్ గురువారం ఇలా వరుస ట్వీట్లు చేశారు. ఇప్పటివరకు 20వేల బాటిల్స్ సేల్ అయ్యాయి అంటూ మస్క్ ట్వీట్ చేశారు.
ఇది వ్యాపారం!
కొత్తగా పెర్‌ఫ్యూమ్ వ్యాపారాన్ని ప్రారంభించారు ఎలాన్ మస్క్. బర్ట్న్ హెయిర్ (Burnt Hair) బ్రాండ్ పేరిట కొత్త రకం ఫ్లేవర్‌ని మార్కెట్‌కు పరిచయం చేశారు. తనను తాను సేల్స్ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నారు.
'ది ఫైనెస్ట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఎర్త్' అంటూ బర్ట్న్ హెయిర్‌ని పేర్కొన్న మస్క్, నా పేరు లాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్ బిజినెస్‌లోకి వస్తున్నానని గతంలో ట్వీట్ చేశారు. ట్విటర్ బయోలో 'పెర్‌ఫ్యూమ్ సేల్స్ మేన్' అని కూడా మార్చుకున్నారు. ఈ రంగంలోకి ప్రవేశించడం తనకు తప్పలేదు అని తన ట్వీట్‌లో ఆయన పేర్కొనడం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం.
ధర రూ.8,400
బర్ట్న్ హెయిర్ ధర 100 డాలర్లు లేదా 8,400 రూపాయలు. బుధవారం లాంచ్ లాంచ్ అయిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడుబోయింది, అమ్ముడుబోతోంది. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10,000 పెర్‌ఫ్యూమ్ బాటిళ్లు సేల్ అయ్యాయని సోషల్ మీడియా ద్వారా మస్క్ వెల్లడించారు. ది బోరింగ్ కంపెనీ (The Boring Company) వెబ్‌సైట్ ద్వారా ‘బర్న్ట్ హెయిర్’ పెర్‌ఫ్యూమ్ కొనుగోలు చేయవచ్చు. డిజిటర్ కరెన్సీ అయిన డోజీకాయిన్స్‌తోనూ చెల్లింపులు చేయవచ్చు. మస్క్ బర్న్ట్ హెయిర్‌ను “ది ఎసెన్స్ ఆఫ్ రిపగ్నెంట్ డిజైర్” అని సదరు వెబ్‌సైట్‌లో పేర్కొనడం విశేషం.
ఓమ్ని జెండర్ ఫెర్‌ప్యూమ్
బర్న్ట్ హెయిర్ ఫెర్‌ప్యూమ్ ఒక ఓమ్నిజెండర్ ప్రొడక్ట్. అంటే, పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అందరూ దీనిని ఉపయోగించవచ్చట. మస్కే ఈ మాట చెప్పారు. అంతేకాదు, ఒక మిలియన్ బాటిల్స్ పెర్‌ఫ్యూమ్ అమ్ముడైతే, అప్పుడు వచ్చే వార్తా కథనాలు ఎలా ఉంటాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
బుధవారం నుంచి ఈ పెర్‌ఫ్యూమ్ బాటిళ్ల అమ్మకాలు మొదలు కాగానే, "బీ ద ఛేంజ్ యూ వాంట్ ఇన్ ది వరల్డ్" అంటూ మరో ట్వీట్ చేశారు.
Also Read: Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల విషయంలో ఈసీ ట్విస్ట్!