అన్వేషించండి

ఫుల్లుగా తాగి వచ్చి ఫ్లైట్ ఎక్కిన పైలట్, పది నెలల జైలు శిక్ష విధించిన కోర్టు

Delta Airlines: డెల్టా ఎయిర్‌లైన్స్ పైలట్ మద్యం సేవించి ఫ్లైట్‌ నడిపేందుకు ప్రయత్నించినందుకు కోర్టు జైలు శిక్ష విధించింది.

Delta Airlines Pilot Drunk: స్కాట్‌లాండ్‌ నుంచి అమెరికాకి వెళ్తున్న Delta Airlines ఫ్లైట్‌లో పైలట్‌ కాసేపు అందరినీ టెన్షన్ పెట్టాడు. మద్యం మత్తులోనే ఫ్లైట్‌ని నడిపేందుకు వెళ్లాడు. గుర్తించిన అధికారులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. 10 నెలల జైలుశిక్ష కూడా విధించారు. Guardian వెల్లడించిన వివరాల ప్రకారం...63 ఏళ్ల కేప్టెన్ లారెన్స్ రసెల్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి మద్యం సేవించాడు. గతేడాది జూన్ 16వ తేదీన ఈ ఘటన జరిగింది. బ్యాగేజ్ కంట్రోల్ వద్ద రసెల్ బ్యాగ్ చెక్‌ చేయగా అందులో రెండు వైన్ బాటిల్స్ కనిపించాయి. పైగా అవి రెండూ ఓపెన్ చేసిన ఉన్నాయి. అప్పటికే సగం ఖాళీ చేశాడు రసెల్. ఆ తరవాత బ్రీథ్ టెస్ట్ కూడా చేశారు. రక్తంలో ఆల్కహాల్‌ పరిమితికి మించి గుర్తించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల ఆ పైలట్‌కి పది నెలల శిక్ష విధించింది. విధుల్లో ఉన్నప్పుడు మద్యం సేవించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రయాణికుల భద్రత అనేది చాలా కీలకం అని దీన్ని దృష్టిలో పెట్టుకునే జైలు శిక్ష విధించినట్టు కోర్టు స్పష్టం చేసింది. 

"లారెన్స్ రసెల్ చేసిన పనికి చాలా మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడిపోయాయి. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఏం చేసే వాళ్లం. ప్యాసింజర్స్‌ సేఫ్‌టీ గురించి పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. ఇలాంటి నేరాల్ని అసలు ఉపేక్షించేది లేదు"

- కోర్టు

గతంలోనూ రెండుసార్లు ఇదే విధంగా విధుల్లో ఉన్నప్పుడు మద్యం సేవించి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. Federal Aviation Administration నిబంధనల ప్రకారం రక్తంలో 0.04% కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉండకూడదు. అంతకు మించి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటారు. నేర తీవ్రతని బట్టి గరిష్ఠంగా రెండేళ్ల వరకూ జైలుశిక్ష విధిస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
CM Chandrababu: వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
వైసీపీ 880 కి.మీ రోడ్లు.. రెండేళ్లలో కూటమి 6,500 కి.మీ- పవన్ కళ్యాణ్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
CM Chandrababu: చాయ్ విక్రేత నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ: కెపాసిటీ బిల్డింగ్‌కు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు
చాయ్ విక్రేత నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ: కెపాసిటీ బిల్డింగ్‌కు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget