Patra Chawl Scam Case: సంజయ్ రౌత్‌కు కస్టడీ పొడిగింపు- ఆ కేసులో ED పురోగతి
Patra Chawl Scam Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఆగస్టు 8 వరకు కస్టడీ పొడిగిస్తూ పీఎమ్ఎల్‌ఏ కోర్టు నిర్ణయం తీసుకుంది.
Patra Chawl Scam Case: పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈ మేరకు ముంబయిలోని ప్రత్యేక సెషన్స్ కోర్టు ఆగస్ట్ 8 వరకు సంజయ్ రౌత్ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసులో ఈడీ ఇప్పటికే పురోగతి సాధించినట్లు పేర్కొంది.
During the hearing in the money laundering case in the Patra Chawl land case earlier today, the Enforcement Directorate (ED) told the Court that they have summoned several people between 5th and 8th August for questioning in connection with the matter.
— ANI (@ANI) August 4, 2022
ఆయన్ను అరెస్ట్ చేసిన అనంతరం పీఎమ్‌ఎల్‌ఏ కోర్టు సంజయ్ రౌత్‌కు ఆగస్టు 4 వరకే కస్టడీ విధించింది. గడువు ముగియడంతో కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది.
నమ్మకం ఉంది
ఇదీ జరిగింది
దక్షిణ ముంబయిలోని ఈడీ జోనల్ ఆఫీసులో దాదాపు 6 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అనంతరం అధికారులు.. సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి 12.05 నిమిషాలకు మనీ లాండరింగ్ చట్టం (PMLA) ప్రకారం సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఠాక్రే వార్నింగ్
మోదీ నేతృత్వంలోని కేంద్రానికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. శివసేన కీలక నేత సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'పుష్ప' సినిమాలో డైలాగ్ చెప్పారు ఠాక్రే.
" సంజయ్ రౌత్‌ను చూసి గర్వపడుతున్నాను. పుష్ప సినిమాలో 'ఝూకేంగా నహీ' (తగ్గేదేలే) అని ఓ డైలాగ్ ఉంటుంది. అయితే వెనక్కి తగ్గని నిజమైన శివసైనికుడు సంజయ్ రౌత్. భాజపా ప్రలోభాలకు లొంగను అని చెప్పిన చాలా మంది ఇప్పుడు వారి వర్గంలో చేరారు. ఇది కాదు బాలాసాహెబ్ ఠాక్రే చెప్పింది. రౌత్ నిజమైన శివ సైనికుడు. రౌత్‌ను అరెస్ట్ చేసి భాజపా విర్రవీగుతోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భవిష్యత్తులో రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాం. "