Petrol Bunks: ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ యజమానులు - ఇక బంకులకు ఇంధన సప్లై యథాతథం
Petrol Bunks News: పలు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్ లలో వాహనదారులు నిల్చున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకులలో స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.
Oil Tankers Protests: ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించారు. మోటారు వాహనాల చట్టాన్ని సవరించడాన్ని నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ధర్నాను విరమించారు. రేపటి నుండి 2 రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె ఉన్నందున పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పలు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్ లలో వాహనదారులు నిల్చున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకులలో స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. డీజిల్ మాత్రం పోయట్లేదని వాహనదారులు తెలిపారు. తాజాగా ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా విరమించడంతో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి. కానీ, పెట్రోల్ బంకుల వద్ద రద్దీ మాత్రం అలాగే ఉంది. కాసేపట్లో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పెరగనున్నాయి.