అన్వేషించండి

Breaking News Telugu Live Updates: హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆసీస్ క్రికెట్ ప్లేయర్లు 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
NTR Name Issue AP and Telangana Breaking News Telugu Live Updates on 24 September 2022 Breaking News Telugu Live Updates: హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆసీస్ క్రికెట్ ప్లేయర్లు 
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (AP Government Employees Retirement Age) 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ఆర్థిక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇవి తమకు కూడా వర్తిస్తాయని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీల ఉద్యోగులు భావించారు. ఈ విషయంపై స్పందించిన ఏపీ ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో క్లారిటీ ఇచ్చింది. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌. ఎస్‌. రావత్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ పదవీ విరమణ వయసు పెంపు వర్తించదు. ఆయా సంస్థలు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు అని ఉత్తర్వులు ఇవ్వడం తగదని ఈ కంపెనీలకు రాష్ట్ర ఆర్థికశాఖ సూచించింది. ఏపీ ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థల్లో పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు ఇవ్వడం సబబు కాదని, అయినా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. తొందరపాటు నిర్ణయాలతో ఇలాంటి ఉత్వర్వులు జారీ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని తాజా ఉత్తర్వులలో ఆర్థికశాఖ పేర్కొంది. ఈ తరహా ఉల్లంఘనలకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రిటైర్మెంట్ వయసు పెంపు ఉత్వర్వులకు సంబంధించి నివేదికను పంపాలని కూడా ఆయా సంస్థలకు నిర్దేశించింది.

ఏపీ, తెలంగాణలో నేడు సైతం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, పశ్చిమ రాజస్థాన్ నుంచి వాయువ్య మధ్యప్రదేశ్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ ల మీదుగా దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ. ఏపీలో సాధారణ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపోవాతావరణంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి.

తిరుమలలో శుక్రవారం‌ భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం 23-09-2022 రోజున 65,158 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి నిన్న 28,416 మంది తలనీలాలు సమర్పించగా, 4.44 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్‌మెంట్లో భక్తులు వేచి ఉండడంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. 
ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువబడుతుంది. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు అర్చకులు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.

17:53 PM (IST)  •  24 Sep 2022

హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆసీస్ క్రికెట్ ప్లేయర్లు 

భారత, ఆసీస్ క్రికెట్ జట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆసీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న క్రికెట్ ప్లేయర్లు భారీ భద్రత మధ్యలో హోటల్ కు బయలుదేరారు. 

14:55 PM (IST)  •  24 Sep 2022

చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడికి జ్యూడీషియల్ రిమాండ్

జల్సాలకు‌ అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పట్టుకొని జ్యుడిస్యల్ రిమాండ్ కు తరలించిన పేట్ బషీరాబాద్ పోలీసులు... 

Voice Over: శాపూర్ నగర్ లోని డిసిపి కార్యాలయంలో బాలానగర్ జోన్ డిసిపి సందీప్ గోనె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్న పంచల్ బారమ్ సింగ్(22) ను  పేట్ బషీరాబాద్‌ పోలీసులు మరియు బాలానగర్ సిసిఎస్ పోలీసులు పట్టుకొని ఇతని వద్ద నుండి 4 తులాల బంగారు నగలు, 2 కిలోల వెండి ఆభరణాలు మొత్తం వీటి విలువ ₹3,20,000/- స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నింధితుడు పంచల్ బారమ్ సింగ్ కు మరో ఆరుగురు నింధితులు 1) Mangal Singh 2) Mangi All 3) Mukesh 4) Mangloi Ramesh 5) Suresh 6) Ramesh Chowhan లు సహకరించారని తెలిపారు. మేడ్చల్(4), పేట బషీరాబాద్‌(2) పియస్ లలో వీరంతా పాత నేరస్తులని, బారమ్ సింగ్ సుచిత్ర సెంటర్ లో అనుమానస్పదంగా తిరుగుతుండగా  అరెస్టు చేసి జ్యుడిస్యల్ రిమాండ్ కు తరలించామని, మరో 6 గురు నింధితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరంతా ధార్ జిలా, మధ్య ప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. దసరా పండుగ కోసం ఊర్లకు వెల్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని పురుజనులను డిసిపి కోరారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget