అన్వేషించండి

Nomad Plane Crash: 47 ఏళ్ల క్రితం క్రాష్ అయిన విమానం, ప్రమాదానికి కారణమేంటో ఇప్పటికి తెలిసిందట!

Nomad Plane Crash: మలేషియాలో 47 ఏళ్ల క్రితం జరిగిన విమాన ప్రమాదానికి కారణమేంటో ఇప్పుడు వెల్లడైంది.

Nomad Plane Crash:

1976లో ప్లేన్ క్రాష్ 

47 ఏళ్ల క్రితం మలేషియాలో ఓ విమాన ప్రమాదం (Malaysia Nomad Plane Crash) జరిగింది. పలువురు రాజకీయ నాయకుల ప్రాణాలు బలి తీసుకుంది ఈ ఘటన. ఆ దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది సంచలనమైంది. కానీ...అసలు ఆ ప్రమాదం ఎందుకు జరిగింది.? అన్నది మాత్రం ఇప్పటికీ ఓ అంతు పట్టని మిస్టరీగా ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఈ మిస్టరీ వీడింది. ఆ ప్రమాదం జరగడానికి కారణమేంటో మలేషియా ప్రభుత్వం వెల్లడించింది. 1976లో జరిగిన ప్లేన్ క్రాష్‌పై రిపోర్ట్ తయారు చేసింది. విమానంలోని ఆస్ట్రేలియా తయారు చేసిన టర్బైన్ ఇంజిన్‌ని ప్రాపర్‌గా లోడ్ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చి చెప్పింది. ఫలితంగా...పైలట్‌ ఫ్లైట్‌పై కంట్రోల్ కోల్పోయాడని వెల్లడించింది. ఎయిర్‌ క్రాఫ్ట్ మాల్‌ఫంక్షన్ కానీ, అగ్ని ప్రమాదం కానీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేని మలేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది. Nomad Planeని గవర్నమెంట్‌ ఎయిర్‌క్రాప్ట్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఆస్ట్రేలియా తయారు చేసింది. టర్బైన్ ఇంజిన్‌ సరిగ్గా లోడ్ అవకపోవడం వల్ల ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం అదుపు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్‌లో 10 మంది ఉన్నారు. పైలట్‌తోపాటు వీళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం దీనిపై 21 పేజీల రిపోర్ట్ తయారు చేసింది మలేషియా. 1976లో జూన్ 6వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. అందుకే...ఈ ఘటన  Double Six (06-06-1976)గా పాపులర్ అయింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, హౌజింగ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్‌తో పాటు మరి కొందరు కీలక నాయకులు ఈ ప్రమాదంలో చనిపోయారు. త్వరలోనే ఈ రిపోర్ట్‌ను విడుదల చేస్తామని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. 

ఇంకా అనుమానాలు..

అయితే...ఇక్కడ మరి కొన్ని అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పైలట్ ఎలాంటి ఆల్కహాల్‌ కానీ, డ్రగ్‌ కానీ తీసుకున్నట్టు లేదు. కానీ అతడికి సంబంధించిన కొన్ని రికార్డులను తొలగించారు. ఓ రికార్డుని తగలబెట్టారు. మరోటి కనిపించకుండా పోయింది. అంతే కాదు. ట్రైనింగ్ పీరియడ్‌లో ఆ వ్యక్తి సరిగ్గా పెర్‌ఫామ్ చేయలేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగే ముందు పైలట్ అనారోగ్యానికి గురయ్యాడన్న వాదనలూ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఫ్లైట్‌లో ఇద్దరు పైలట్‌లు ఉంటారు. కానీ...ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల ఓ పైలట్‌ను దించేశారు. ఒకవేళ ఇద్దరు పైలట్‌లు ఫ్లైట్‌లో ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని చెబుతున్నారు అధికారులు. 1977 జనవరి 25వ తేదీనే క్రాష్ రిపోర్ట్ తయారైంది. కానీ ఇన్నిరోజుల పాటు అది వెలుగులోకి ఎందుకు తీసుకురాలేదన్నది మాత్రం మలేషియా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. పూర్తి స్థాయిలో విచారణ చేశాకే ఈ వివరాలు చెబుతున్నామని అంటున్నప్పటికీ అనుమానాలు మాత్రం ఇంకా వీడడం లేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చనిపోతే ఇన్నేళ్లు అలా సైలెంట్‌గా ఉంటారా..? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. 

Also Read: Asad Ahmed Encounter: పాకిస్థాన్‌నూ భయపెడుతున్న సీఎం యోగి, అసద్ ఎన్‌కౌంటర్‌తో వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamCyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget