తిరుపతిలో నిర్మలా సీతారామన్ పర్యటన- బుగ్గన ఘన స్వాగతం
Nirmala Sitharaman AP Tour: తిరుపతిలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏపీ ఆర్థిక శాక మంత్రి ఆమెకు ఘన స్వాగతం పలికారు.
Nirmala Sitharaman AP Tour: తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇవాళ(అక్టోబర్ 19) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుపతికి బయల‌్దేరారు. తిరుపతిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5 .00 గంటలకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటారు. ఈరోజు రాత్రి తిరుమలలోని పద్మావతి అతిధి గృహంలో బస చేసి, 20వ తేదీన ఉదయం తిరుమల శ్రీవారిని నిర్మలా సీతారామన్ దర్శించుకోనున్నారు.
తిరుపతిలో జరుగనున్న టాక్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. తిరిగి తిరుమలకు చేరుకుని బస చేయనున్నారు. 21వ తేదీ ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకుని, శ్రీకాళహస్తి దేవస్ధానానికు చేరుకుని స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అందుకోనున్నారు. అటు తర్వాత రోడ్డు మార్గం గుండా మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.