By: Ram Manohar | Updated at : 15 Dec 2022 06:22 PM (IST)
నీరవ్ మోడీ యూకే సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది.
Nirav Modi Extradition:
పిటిషన్ కొట్టివేత..
మనీలాండరింగ్ కేసులో భారత్ నుంచి లండన్‌కు పారిపోయిన నీరవ్ మోడీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారత్‌కు రాకుండా ఉండేందుకు ఆయన చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. లండన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ...ఆయన సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని భావించారు. అక్కడైనా సానుకూల తీర్పు వస్తుందని ఆశించినా...అసలు ఆ పిటిషన్‌ను విచారించేందుకే అనుమతి లభించలేదు. "సుప్రీం కోర్టుకి నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం" అని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ తేల్చి చెప్పింది. అంటే...కనీసం సుప్రీం కోర్టుకు వెళ్లి అక్కడ అర్జీ పెట్టుకునేందుకు కూడా వీల్లేకుండా పోయింది. 2019 నుంచి లండన్ జైల్లోనే ఉన్నాడు నీరవ్ మోడీ. నీరవ్ పిటిషన్‌ను తిరస్కరించడమే కాకుండా...లీగల్ ఖర్చుల కింద రూ.1.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. భారత్‌లో సీబీఐ, ఈడీ నీరవ్ మోడీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది.
Nirav Modi, wanted in India to stand trial on fraud and money laundering charges, loses bid to appeal against extradition in UK Supreme Court
— Press Trust of India (@PTI_News) December 15, 2022
భారత్‌కు రావడమే తరువాయి..
భారత్‌కు తిరిగి రాకుండా నీరవ్ మోడీ లండన్ హైకోర్ట్‌లో వేసిన పిటిషన్‌ను ఆ న్యాయస్థానం ఇటీవలే కొట్టి వేసింది. భారత్‌కుఅప్పగించేందుకు మార్గం సుగమమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11 వేల కోట్ల మనీలాండరింగ్ పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నీరవ్ మోడీ. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు లండన్‌కు పారిపోయాడు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య "నీరవ్ మోడీ అప్పగింత"పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చట్టంలోని ఏదో ఓ లొసుగుని అడ్డం పెట్టుకుని కాలం గడిపేస్తూ వచ్చాడు. అయితే..భారత్‌కు అప్పగిం చేందుకు లండన్ ప్రభుత్వం అంగీకరించింది. దీనిని సవాలు చేస్తూ లండన్ హైకోర్టులో నీరవ్ పిటిషన్ వేశాడు. దీన్ని న్యాయస్థానం కొట్టేసింది. ఫలితందా..భారత్‌కు అప్పగించడంలో ఓ అడుగు ముందుకు పడింది. అయితే...లండన్ నుంచి భారత్‌కు రప్పించే ప్రక్రియ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇందుకు ఇంకా చాలా తతంగం ఉంది. భారత్‌కు అప్పగించాక నీరవ్ మోడీని ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైల్‌కు తరలించనున్నారు. నీరవ్ మోడీతో పాటు మెహుల్ చోక్సీ కూడా ఈ స్కామ్‌లో పాలు పంచుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో తుది తీర్పు వచ్చేంత వరకూ జైల్లోనే ఉండనున్నాడు. నీరవ్ మోదీ ఎప్పుడెప్పుడు వస్తాడా అని సీబీఐ, ఈడీ ఎదురు చూస్తున్నాయి.
బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లూప్‌హోల్స్‌ని పట్టుకుని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన మోదీకి కఠిన శిక్ష వేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. ఈ ముగ్గురు భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు చెక్కేసిన వ్యక్తులు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన వీళ్ల దగ్గర నుంచి దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో తెలిపింది.
Also Read: Putin Flu Vaccine: రష్యాను వణికిస్తోన్న ఫ్లూ- వ్యాక్సిన్ తీసుకున్న అధ్యక్షుడు పుతిన్!
Tirumala Update: ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జరిగే పూజలు ఇవే!
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
Petrol-Diesel Price 05 February 2023: రాజమండ్రిలో చమురు మంట, పెద్ద నోటు ఉంటేనే పెట్రోల్ బంక్‌కు వెళ్లండి
ABP Desam Top 10, 5 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన