Nipha Virus: నిఫా వైరస్ నియంత్రణకు 100 కోట్ల నిధులు కేటాయించిన కేంద్రం
Nipha Virus: నిఫా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ఆరోగ్య శాఖ రూ.00 కోట్ల నిధులను విడుదలే చేసింది. ఇదే విషయాన్ని మంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు.
Nipha Virus: నిఫా వైరస్ కారణంగా కేరళలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ఆరోగ్య శాఖ వంద కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. కేరళలోని వివిధ జిల్లాల్లో ఉన్న లేబరేటరీలకు ఈ నిధులు విడుదల చేస్తూ వైరస్ ను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. వైరస్ నిర్ధారణ పరీక్షలతో పాటు నిఫా బాధితులకు అవసరం అయిన చికిత్స అందించడం, వైరస్ నియంత్రణ చర్యలకు ఈ వంద కోట్ల రూపాయల నిధులను వినియోగించాలని అధికారులకు మంత్రి సూచించారు. కరోనా వ్యాప్తితో దేశం చాలా పటిష్టంగా తయారైంది.. దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఆ వ్యాధి బారిన పిడనా వెంటనే తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు.
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమాండ్ సిస్టమ్ ద్వారా వైరస్ అనికిని వెంటనే తెలుసుకోగలుగుతున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. కేరళలో నిఫా వైరస్ నియంత్రణకు జిల్లా స్థాయిలో ఇప్పటికే ఉన్న అన్ని ల్యాబ్ లకు అదనంగా మరిన్ని కొత్త ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేరళలో నిఫా బాధితుల సంఖ్య ఆరుకు చేరిందని అన్నారు. వైరస్ బారిన పడి ఇప్పటికే ఐధుగురు చినపోయారని.. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వైరస్ నియంత్రమకు మెరుగైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైరస్ కేసులు బయటపట్ట గ్రామాలతో పాటు చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో కంటైన్ మెంట్ ప్రకటించామని మంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. వైరస్ వ్యాప్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ గా ఉన్నాయని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
మరోవైపు కోజికోడ్ లో లక్ష గబ్బిలాలు
కొజికోడ్‌లోని కరుణాపురం గ్రామంలో 15 ఎకరాల మేర పెద్ద పెద్ద చెట్లున్నాయి. స్వచ్ఛమైన గాలినిచ్చే ఆ చెట్లను చూస్తేనే అక్కడి ప్రజలు కలవర పడుతున్నారు. అందుకు కారణం...ఆ చెట్లకు కాయలు, పండ్ల కన్నా ఎక్కువగా గబ్బిలాలే ఉండటం. సాధారణంగా ఆ ప్రాంతంలో గబ్బిలాలు చెట్లపైకి (Fruit Bats) వచ్చి చేరుతుంటాయి. కానీ...ఈ ఏడాది జులై నుంచి వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. మొత్తం చెట్లను కమ్మేస్తున్నాయి. ఈ జులై నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల గబ్బిలాలు ఆ చెట్లపై వాలుతున్నాయి. అక్కడే ఉంటున్నాయి. అంతే కాదు. కాఫీ తోటల్ని, యాలకుల మొక్కల్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. చెట్లకు కాసిన పండ్లను, కాయల్ని కొరికేస్తున్నాయి. ఈ భయంతో అక్కడ ఒక్క చెట్టువైపు కూడా చూడడం లేదు స్థానికులు. పొరపాటున కూడా అక్కడ కాసిన పండ్లను కోసి తినడం లేదు. అసలే నిఫా వైరస్ వ్యాప్తి చెందుతోంటే...ఇలా వేల సంఖ్యలో గబ్బిలాలు వచ్చి చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓపెన్ ట్యాంక్‌లతో పాటు చెరువులు, కుంటలు, బావులు..ఇలా నీరు దొరికే ప్రతి చోటా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ నీటిలో గబ్బిలాల వ్యర్థాలు ఉండే అవకాశముందని, వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని అవగాహన కల్పిస్తున్నారు. పండు కనిపించిందంటే చాలు వాటిని కొరికి పెడుతున్నా గబ్బిలాలు. అయితే...ఈ గబ్బిలాలను వెళ్లగొట్టేందుకు స్థానికులు బాంబులు పేల్చాలని చూశారు. అధికారులు అందుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే అవి చెల్లాచెదురై వాటి వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్లే ప్రమాదముందని చెప్పారు. ఆ చెట్లను సంరక్షిస్తూనే గబ్బిలాలను అక్కడి నుంచి తోలే ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం లక్ష వరకూ గబ్బిలాలు ఉండొచ్చని చెప్పారు. ఈ లెక్కలు స్థానికులను ఇంకాస్త కలవర పెడుతున్నాయి.