News
News
X

Russian Missile Attack: ఉక్రెయిన్‌లో పసికందును పొట్టనపెట్టుకున్న రష్యా

Russian Missile Attack: రష్యా చేసిన రాకెట్ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో అప్పుడే పుట్టిన ఓ నవజాత శిశువు మృతి చెందింది.

FOLLOW US: 
 
Russian Missile Attack: రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో ఇప్పటికే ఎంతో మంది మరణించారు. రష్యా చేస్తోన్న భీకర దాడులను ఉక్రెయిన్ సైన్యం తిప్పికొడుతోంది. అయితే తాజాగా అందరి మనసులను కలచివేసే సంఘటన ఉక్రెయిన్‌లో జరిగింది. రష్యా చేసిన రాకెట్ దాడుల కారణంగా ఓ పసికందు మృతి చెందింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది.

ఇదీ జరిగింది

బుధవారం విల్నయాన్స్క్ నగరంలోని ఓ చిన్న ప్రసూతి వార్డుపై రష్యా బలగాలు పెద్ద రాకెట్లతో దాడి చేశాయి. ఈ దాడితో ఆ ప్రసూతి వార్డులో అప్పుడే శిశువుకు జన్మనిచ్చిన తల్లికి గర్భశోకమే మిగిలింది. రష్యా చేసిన దాడితో అప్పుడే ఈ ప్రపంచాన్ని చూసిన శిశువు ప్రాణాలు కోల్పోయింది. జపోరిజ్జీయా ప్రాంత మిలటరీ పరిపాలన విభాగం అధిపతి టెలిగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

విల్నయాన్స్క్.. ఉక్రెయిన్ అధీనంలో ఉన్న నగరం. జపొరిజ్జియాలోని అనేక ప్రాంతాల్ని రష్యా ఇప్పటికే ఆక్రమించుకుంది. అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తూ తమ భుభాగంగా పేర్కొంటుంది.

News Reels

రష్యానే జవాబుదారి

హృదయం దుఃఖంతో నిండిపోయిందని, అప్పుడే పుట్టి ఈ ప్రపంచాన్ని చూసిన శిశువు మరణించడం నన్నూ కలిచివేసిందని జపొరిజ్జియా గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి ఘటనను ఖండిస్తూ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

" తీవ్రవాద దేశమైన రష్యా మన దేశం పౌరులపై, ఆస్తులపై దాడి చేస్తూనే ఉంటుంది. శత్రువు.. బీభత్సం, దాడులు, మరణాలతో సాధించలేనిది ఇప్పుడు సాధించాలి అనుకుంటుంది. ఇక్కడ జరిగిన దారుణాలకు జవాబుదారీ కావడం తప్ప రష్యా ఏమీ సాధించలేదు "
-                 వ్లొదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు

రష్యా-ఉక్రెయిన్ యుద్దం

ఫిబ్రవరి 24 న రష్యా.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రారంబించింది. గత తొమ్మిది నెలలుగా యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంది. ఇరు దేశాలకు తీవ్ర నష్టం జరగడంతోపాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.

Published at : 24 Nov 2022 05:08 PM (IST) Tags: Ukraine New born Killed In Russian Missile Strike Maternity Ward Russian Missile Attack

సంబంధిత కథనాలు

UPI Transactions: పల్లెలూ, చిన్న పట్టణాల్లో 650% పెరిగిన యూపీఐ లావాదేవీలు - పట్టణాలతో ఢీ!

UPI Transactions: పల్లెలూ, చిన్న పట్టణాల్లో 650% పెరిగిన యూపీఐ లావాదేవీలు - పట్టణాలతో ఢీ!

సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే అపశృతి, బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి

సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే అపశృతి, బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

టాప్ స్టోరీస్

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

Most T20 Wickets 2022: మీ పెద్దోళ్లున్నారే! అంటూనే ఎక్కువ వికెట్లు పడగొట్టిన కుర్రాళ్లు - 2022 టీ20 టాప్‌ 10 బౌలర్లు వీరే!

Most T20 Wickets 2022: మీ పెద్దోళ్లున్నారే! అంటూనే ఎక్కువ వికెట్లు పడగొట్టిన కుర్రాళ్లు - 2022 టీ20 టాప్‌ 10 బౌలర్లు వీరే!

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్