అన్వేషించండి

Covid Variant JN.1: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్, మరో వేవ్ వస్తోందా?

Covid Variant JN.1 Cases: కొవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆందోళన పెంచుతోంది.

 Covid Variant JN.1 Cases Surge:

కొవిడ్ కొత్త వేరియంట్..

కొవిడ్‌ ఇప్పట్లో మనల్ని వదిలేలా కనిపించడం లేదు. ఇక ఈ వైరస్ సోకదు అనుకున్న ప్రతిసారీ ఏదో  వేరియంట్ రూపంలో మరోసారి విచురుకుపడుతోంది. ఈ సారి JN.1 వేరియంట్ వణికిస్తోంది. ఇప్పటికే కేరళలో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. గత వేరియంట్స్‌ కన్నా చాలా ప్రమాదకరమైందని సైంటిస్ట్‌లు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. తిరువనంతపురంలో ఓ వ్యక్తికి RT-PCR టెస్ట్ చేయగా..ఈ వేరియంట్ బయటపడింది. డిసెంబర్ 8వ ఈ విషయం వెల్లడైంది. 79 ఏళ్ల మహిళకు ఫ్లూ లక్షణాలు కనిపించగా టెస్ట్ చేశారు. కొవిడ్‌ నుంచి రికవరీ అయినప్పటికీ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆందోళన పెంచుతోంది. ఈ వేరియంట్‌తో  (Covid Variant JN.1)కేసులు కూడా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్  BA.2.86 (Pirola) నే JN.1 Variantగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ అమెరికాలో తొలిసారి ఈ వేరియంట్ కేసు నమోదైంది. డిసెంబర్ 15న కూడా చైనాలో ఇదే వేరియంట్‌ 7 కేసులు నమోదయ్యాయి. స్పైక్ ప్రోటీన్‌లో తప్ప BA.2.86, JN.1 వేరియంట్స్‌కి పెద్దగా తేడా కనిపించడం లేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వేరియంట్ వైరస్‌ ఉపరితలంపై ఉండే Spike Protein వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతోంది. స్పైక్‌ ప్రోటీన్‌ని కట్టడి చేసే వ్యాక్సిన్‌లు అన్నీ ఈ JN.1 వేరియంట్‌పై కచ్చితంగా పని చేయాలని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఈ వేరియంట్‌పై అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తే కేసులు మరింత పెరిగే ప్రమాదముందని వార్నింగ్ ఇచ్చారు. ఆందోళన పక్కన పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

లక్షణాలివే..

జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి ఈ వేరియంట్ (Covid Variant JN.1 Symptoms) లక్షణాలు. ఇప్పటి వరకూ ఈ వైరస్ సోకిన వాళ్లలో ఈ లక్షణాలు కనిపించాయి. కొంత మంది బాధితుల్లో శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. నాలుగైదు రోజుల పాటు ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైతే...వీలైనంత ఎక్కువగా టెస్ట్‌లు చేయాలని సూచిస్తున్నారు వైద్యులు. అది కొవిడ్‌ వైరస్సా కాదా అని తెలుసుకోడానికై పరీక్షలు చేయాల్సిన అవసరముందని చెబుతున్నారు. మిగతా వైరల్ ఇన్‌ఫెక్షన్లలోనూ ఇవే లక్షణాలు కనిపిస్తుండడమే ఇందుకు కారణం. అలా అని కొత్త వేవ్ వచ్చేస్తోందని భయపడాల్సిన పని లేదని అంటున్నారు వైద్యులు. మిగతా వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌లానే వచ్చి వెళ్లిపోతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరిస్తున్నారు. అందుకే నిఘా పెంచాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, వీలైనంత వరకూ భౌతిక దూరం పాటించడం, టెస్ట్‌లు చేయించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా వెంటనే ఐసోలేట్ అవ్వాలి. ఇప్పటికే పలు వేరియంట్‌లు ప్రపంచాన్ని వణికించాయి. ఇప్పుడు మరో వేరియంట్ గుబులు పెంచుతోంది. ఇకపై ఇంకెన్ని వేరియంట్‌లు వస్తాయో స్పష్టత లేదు. కానీ ఎప్పుడైనా వైద్యులు మాత్రం జాగ్రత్తగా ఉండడమొక్కటే మందు అని చెబుతున్నారు. 

 Also Read: Indian Student Missing: యూకేలో భారతీయ విద్యార్థి అదృశ్యం,జైశంకర్ సాయం కోరిన బీజేపీ నేత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget