National Monetisation Plan: 'రాహుల్.. అసలు మానిటైజేషన్ అంటే ఏంటో తెలుసా?'
రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీకి అసలు మానిటైజేషన్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు నిర్మలా.
నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ పై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. తాము ఏ ఆస్తులను అమ్మడం లేదని వాటిని లీజ్ కు మాత్రమే ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
This Asset Monetisation Pipeline is talking about brownfield assets which need to be better monetised. Ownership of assets remains with the govt. There will be a mandatory hand-back; they will have to give it back after a certain time: Smt @nsitharaman pic.twitter.com/9WtJsTyDpE
— NSitharamanOffice (@nsitharamanoffc) August 23, 2021
Also Read: Rahul Gandhi Press Meet: ఇది ప్రైవేటీకరణ కాదు.. దేశాన్ని అమ్మేయడం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ విమర్శలు..
కేంద్రం ప్రకటించిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. 70 ఏళ్లలో కాంగ్రెస్ నిర్మించిన ఆస్తులను మోదీ సర్కార్ అమ్మకానికి పెట్టిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రైవటీకరణ పేరుతో దేశంలో ఆస్తులను మోదీ అమ్మేస్తున్నారని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Asset Monetisation Plan: మోదీజీ.. ఇవేం మీ ఆస్తులు కాదు అమ్మేయడానికి: దీదీ