Free Health Insurance: కరోనాతో అనాథలైన పిల్లలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్
కరోనాతో అనాథలైన పిల్లలను కేంద్రం ఆదుకోనుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.
కరోనా వైరస్ వల్ల చాలా మంది బతుకులు ఛిద్రమయ్యాయి. ఎంతో మంది చిన్నారులను మహమ్మారి అనాథలను చేసింది. ఒకే ఇంట్లో తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మారిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పిల్లలను కేంద్రం ఆదుకోనుంది. కొవిడ్ వల్ల పేరెంట్స్ ను కోల్పోయిన పిల్లలకు ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.
18 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఇది వర్తిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెంట్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్ (PM CARES) కింద ప్రీమియం డబ్బులు చెల్లిస్తామని ఠాకూర్ పేర్కొన్నారు.
कोविड से प्रभावित बच्चों के देखभाल हेतु उठाए कदमों के तहत 18 साल तक के बच्चों को आयुष्मान भारत के तहत 5 लाख रुपये का मुफ्त स्वास्थ्य बीमा दिया जाएगा और इसके प्रीमियम का भुगतान पीएम केयर्स द्वारा किया जाएगा। #MonsoonSession https://t.co/Gxpj7sFlYV pic.twitter.com/kfa7fTWigq
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) August 4, 2021
పాపం పసివాళ్లు..
ఏడాదిన్నర కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి విలయంలో ఎంతోమంది ఎన్నో కోల్పోయారు. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన ఈ మహమ్మారి.. చాలామంది చిన్నారులకు కన్నవారిని దూరం చేసింది. లక్షల మంది పిల్లలను దిక్కులేనివారిని చేసింది. కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మందికి పైనే చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయినట్లు లాన్సెట్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఒక్క భారత్‌లోనే 1.19 లక్షల మంది పిల్లలపై కరోనా కాఠిన్యం చూపించింది.
ఆ దేశాలపై..