అన్వేషించండి

Revanth Cabinet Decisions: మహిళలకు తొలిరోజే రేవంత్ సర్కార్ బిగ్ గుడ్‌న్యూస్! 2 గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్ - అమలుకు డేట్ ఫిక్స్: మంత్రి

Telangana News: తాము ఎన్నికలకు ముందు ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం ఈ మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించామని వివరించారు.

Revanth Reddy Cabinet Desicions: తెలంగాణ కేబినెట్ సమావేశంలో (Telangana Cabinet Desicions) తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాల గురించి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వివరించారు. తాము ఎన్నికలకు ముందు ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం ఈ మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించామని వివరించారు. అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ మొదటి కేబినెట్‌లో రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రేపు మళ్లీ ఈ రెండు గ్యారంటీలపై సుదీర్ఘంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో చర్చించి డిసెంబరు 9న వాటిని మొదలు పెడతామని (Minister Sridhar Babu Press Meet) అన్నారు. 

అమలు చేయబోయే రెండు గ్యారంటీలు
మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీలో భాగంగా పది లక్షల వరకూ పెంపు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని నిర్ణయించామని శ్రీధర్ బాబు వివరించారు. డిసెంబర్ 9 నుంచి వీటిని అమలు చేస్తామని అన్నారు. ఆధార్ కార్డు లేదా, ఏదైనా గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని శ్రీధర్ బాబు తెలిపారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9 నుంచి ఈ రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్లుగా శ్రీధర్ బాబు తెలిపారు.

రేపు విద్యుత్ రంగంపై సీఎం రేవంత్ సమీక్ష (CM Revanth Review Meet)
విద్యుత్ అంశంపై ఉన్న గ్యారంటీలో భాగంగా కోతలు లేని విద్యుత్ సరఫరా కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. 2014లో ఇప్పటిదాకా విద్యుత్ రంగంలో అనేక తప్పులతడకలు ఉన్నాయని చెప్పారు. ఈ అంశాలపై కూడా చర్చించామని అన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశమై సమీక్ష జరుపుతారని అన్నారు. దీంట్లో కరెంటు రంగానికి సంబంధించి అనేక అంశాలు చర్చిస్తారని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక  పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం - మంత్రి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కోరినట్లుగా శ్రీధర్ బాబు చెప్పారు. 2014 నుంచి 2023, డిసెంబర్ 7 వరకూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు. రేపు విద్యుత్ శాఖపై ఉన్నతాధికారులతో రేవంత్ సమీక్ష చేస్తారని చెప్పారు.

Telangana Assembly ఎల్లుండి అసెంబ్లీ
డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశం ఉంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఆరోజు ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుందని, సభలో సీనియర్ సభ్యుడైన వ్యక్తిని ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకుంటారని చెప్పారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అదే రోజు ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నేడు (డిసెంబర్ 7) ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రుల్లో ఎవరికి ఏ శాఖలు కేటాయించారో ఇంకా స్పష్టత లేదని, మీడియాలో వచ్చే వార్తలు అబద్ధమని శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget